Begin typing your search above and press return to search.

కింగ్‌డ‌మ్ కోసం వంగా.. ఒకే ఫ్రేమ్‌లో హై వోల్టేజ్ కాంబో!

ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేక్షకులెంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఇంటర్వ్యూకు ఇప్పటికే మంచి బజ్ వచ్చింది.

By:  Tupaki Desk   |   24 July 2025 10:56 PM IST
కింగ్‌డ‌మ్ కోసం వంగా.. ఒకే ఫ్రేమ్‌లో హై వోల్టేజ్ కాంబో!
X

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “కింగ్‌డ‌మ్” రిలీజ్‌కు ఇంకా తక్కువ రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సినిమాతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మళ్లీ మరోసారి ప్రేక్షకుల మనసులను దోచేందుకు సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్‌కి సరసన భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించగా, కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కింగ్‌డ‌మ్ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. సినిమా విడుదల సమీపిస్తున్న వేళ, చిత్రయూనిట్ విభిన్నంగా ప్రమోషన్లను ప్లాన్ చేసింది. టిపికల్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు భిన్నంగా ఈసారి మీడియా ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ట్రైలర్ వేడుకను తిరుపతిలో నిర్వహించగా, ఇక ప్రధానంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల కోసం మరో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా రెడీ అవ్వడం విశేషం. విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సందీప్ వంగా ఇప్పుడు 'కింగ్‌డ‌మ్' ప్రమోషన్ ఇంటర్వ్యూకు అతిథిగా వచ్చారు. త్వరలోనే ఇంటర్వ్యూ వీడియో రిలీజ్ కానుంది.

ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేక్షకులెంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఇంటర్వ్యూకు ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగా ముగ్గురూ స్టైలిష్ లుక్స్‌లో కనిపించారు. కార్లతో బ్యాక్‌డ్రాప్‌లో తీర్చిదిద్దిన ఈ ఫొటో కింగ్‌డ‌మ్ టీం స్టైలిష్ ప్రమోషన్‌కు ఉదాహరణగా నిలిచింది.

ఇక విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా ఈ సినిమా చాలా కీలకమైనది. ఇటీవల ఆయన చేసిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, కింగ్‌డ‌మ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కథ, కథనం పరంగా గౌతమ్ తిన్ననూరిపై నమ్మకంతో నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్ పెట్టి ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించారు. యాక్షన్, థ్రిల్ మిక్స్‌తో రూపొందిన ఈ చిత్రం విజయ్‌కు మళ్లీ హిట్ టికెట్ అందించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తోంది.