Begin typing your search above and press return to search.

రాజమౌళిలా కంట్రోల్ చేస్తున్న వంగా!

కానీ ఇప్పుడు అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పూర్తి స్థాయిలో కంట్రోల్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 July 2025 12:32 PM IST
రాజమౌళిలా కంట్రోల్ చేస్తున్న వంగా!
X

బాహుబలి తరువాత ప్రభాస్ చాలా ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఏ ఒక్క దర్శకుడికి కూడా ఆయన బల్క్ డేట్స్ ఇవ్వలేదు. ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ, ఒకటి పూర్తవకముందే మరొకటి మొదలుపెట్టి, అన్నీ ఓ వరుసలో చేయడం ప్రభాస్ స్టైల్‌గా మారింది. కానీ ఇప్పుడు అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పూర్తి స్థాయిలో కంట్రోల్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

సందీప్ వంగా తన సినిమా కోసం ప్రభాస్ డేట్స్‌ను బల్క్‌గా తీసుకోవాలని ముందుగానే చెప్పినట్టు సమాచారం. ప్రభాస్ కూడా ఆ మాటను అంగీకరించి, సెప్టెంబర్ నుండి స్పిరిట్ షూట్ కోసం ఫుల్ టైం ఇవ్వబోతున్నాడు. సినిమా మొత్తానికీ కావాల్సిన శారీరక, మానసిక మేకోవర్ కోసం వంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఇంకొక సినిమా చేయకూడదు, లుక్ మారిపోవొచ్చు అని ప్రభాస్‌ను ప్రత్యేకంగా అడిగినట్టు తెలుస్తోంది.

ఇది చూస్తుంటే రాజమౌళి బాహుబలిలో చేసిన మానిటరింగ్‌నే వంగా ఇప్పుడు స్పిరిట్ కోసం చేస్తున్నట్టుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ షూట్‌ను జూలైలో పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుండటంతో ఇప్పుడే షూటింగ్ స్పీడ్ పెంచారు. కానీ 'ఫౌజీ' సినిమా మాత్రం ఇంకా 50 శాతం కూడా పూర్తవలేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాకు భారీ కాలం అవసరమవుతుంది.

కానీ సెప్టెంబర్ నుండి స్పిరిట్ స్టార్ట్ కావడంతో ఫౌజీని అప్పటివరకు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో వంగా కూడా తాను డిమాండ్ చేసినట్టుగానే పూర్తి డెడికేషన్‌తో ఉన్న హీరోను కోరుకుంటున్నాడు. స్పిరిట్‌లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అవాల్సిన అవసరం ఉంది. బాడీ లాంగ్వేజ్, గెటప్, డయలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉండాలి.

దానికోసం టైమ్ కావాలి, ఫోకస్ కావాలి, మరే సినిమాకు వెళ్లకుండా ఉండాల్సిందే అని వంగా భావిస్తున్నాడు. అందుకే ప్రీ ప్రొడక్షన్ నుంచే టైట్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే.. ప్రభాస్‌కి రాజమౌళి తరహాలో కంట్రోల్ చేస్తున్న ఏకైక దర్శకుడు వంగానే అని. ప్రభాస్‌ను తనే డిజైన్ చేసుకుంటూ.. ఏ ఒక్క డిస్ట్రాక్షన్ కూడా లేకుండా తన సినిమాకే ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు.