Begin typing your search above and press return to search.

దీపిక X స్పిరిట్ ఇష్యూ.. కియారా పిక్ షేర్ చేసిన సందీప్..

తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించి పిక్ షేర్ చేసి పోస్ట్ పెట్టారు సందీప్.

By:  Tupaki Desk   |   22 Jun 2025 11:18 PM IST
దీపిక X స్పిరిట్ ఇష్యూ.. కియారా పిక్ షేర్ చేసిన సందీప్..
X

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు స్పిరిట్ మూవీ వర్క్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ నటిస్తుండగా.. సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు. అప్డేట్స్ కోసం సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రీసెంట్ గా స్పిరిట్ మూవీలో ఫిమేల్ లీడ్ గా క్రేజీ బ్యూటీ త్రిప్తీ డిమ్రీని మేకర్స్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను తప్పించి హీరోయిన్ గా తృప్తిని తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో సందీప్ వంగా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశమైంది.

తాను ఇటీవల ఓ టాప్ హీరోయిన్ కు స్టోరీ చెప్పానని, 100 శాతం నమ్మకంతో వివరించానని సందీప్ తెలిపారు. నటీనటులకు డైరెక్టర్లు కథ నెరేట్‌ చేశారంటే అనధికారిక నాన్ డిస్‌ క్లోజర్‌ అగ్రిమెంట్‌ ఉన్నట్లే లెక్క అని అన్నారు. ఆమె ఒప్పందాన్ని బ్రేక్‌ చేసి లీక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని, కావాలంటే మొత్తం లీక్ చేసుకోండని ఫైర్ అయ్యారు.

ఆమె పీ ఆర్‌ టీమ్‌ తన స్టోరీని లీక్‌ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత అనేక మంది నెటిజన్లు, సెలబ్రిటీలు స్పందించారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు పెట్టారు. మొత్తానికి దీపిక ఇష్యూ.. సందీప్ పోస్ట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించి పిక్ షేర్ చేసి పోస్ట్ పెట్టారు సందీప్.

అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే సందీప్ దర్శకత్వం వహించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ కబీర్ సింగ్.. రిలీజ్ అయ్యి ఆరేళ్లు కంప్లీట్ అయింది. దీంతో ఆయన కియారా అడ్వాణీ పిక్ ను షేర్ చేసి.. ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు. సినిమాలో హీరోగా నటించిన షాపిద్ కపూర్ కూడా ఫోటోలో ఉండాలి! కానీ కియారా పిక్ నే షేర్ చేయడం గమనార్హం.

అయితే ఇటీవల దీపికా పదుకొణె, సందీప్ రెడ్డి వంగా మధ్య తీవ్రంగా అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్న వేళ.. కియారాపై ప్రశంసలు కురిపించేందుకే సందీప్ అలా పోస్ట్ పెట్టారని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కౌంటర్ ఇచ్చేందుకే పోస్ట్ చేసి ఉంటారని అంటున్నారు. మొత్తానికి కియారా పిక్ ను మాత్రమే షేర్ చేయడంతో అందరి ఫోకస్ ఒక్కసారిగా పడింది.