'బేబీ' జంట కొత్త మూవీ.. ఫస్ట్ సింగిల్ విన్నారా?
టాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: M Prashanth | 9 March 2026 5:31 PM ISTటాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంచారమే అంటూ సాగుతున్న ఆ పాట మంచి రెస్పాన్స్ అందుకుంటా.. సూపర్ మెలోడీగా మెప్పిస్తోంది. సినిమా కథలోని మెయిన్ రోల్స్ ఎమోషనల్ జర్నీని సాంగ్ క్లియర్ గా చూపిస్తోంది.
ఆ పాటకు ప్రముఖ కవి, రైటర్ గోరటి వెంకన్న లిరిక్స్ అందించగా.. ప్యూర్ తెలుగు పదాలు, హృదయాన్ని తాకే భావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియన్ కల్చర్, ఫారిన్ లైఫ్ స్టైల్ మధ్య ఉండే తేడాలను సింపుల్ గా వ్యక్తపరుస్తూ సంచారమే పాట సాగుతుంది. సినిమా స్టోరీకి అనుగుణంగా, యూత్ మనసుల్లోని ఫీలింగ్స్ వ్యక్తపరిచేలా సాంగ్ ను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.
సంచారమే పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ బాణీలు కట్టారు. ఆయన కంపోజిషన్ సాంగ్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది అంతేకాకుండా హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరటి వెంకన్న కలిసి సాంగ్ ను ఆలపించడం విశేషం. వారి వాయిస్ పాటలోని భావాన్ని ప్రేక్షకుల హృదయాలకు
చేరవేస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అదే సమయంలో సాంగ్ విజువల్స్ పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ఫారిన్ బ్యాక్ డ్రాప్ తో షూట్ చేసిన ఆ సాంగ్ లో లండన్ లోని ఫేమస్ స్పాట్స్ చూపించారు మేకర్స్. అక్కడి నేచుర్ సీన్స్, సిటీ వాతావరణం మధ్య తెలుగు పాటను చిత్రీకరించిన విధానం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఓవరాల్ గా సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుని.. అనేక మంది ఫేవరెట్ లిస్ట్ లోకి చేరిపోయిందని చెప్పాలి.
ఇక సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన బేబీ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన జంట మళ్లీ కలిసి నటించడంతో కొత్త సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు సాంగ్ లో వీరి మధ్య కనిపించే ఎమోషనల్ మూమెంట్స్, కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ మూవీతో ఆదిత్య హాసన్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఆయన తీసిన 90స్ వెబ్ సిరీస్ ఓ రేంజ్ లో మెప్పించగా.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై లక్ ను టెస్ట్ చేసుకోనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ అజీమ్ మహమ్మద్ నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి చేపట్టారు. మరి స్మూత్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
