Begin typing your search above and press return to search.

స‌నా చీర‌క‌ట్టులో సంథింగ్ ఏదో ఉందిలే

ముఖ్యంగా చీర‌లో స‌నా షేక్ అంద‌చందాలు ఎప్పుడూ యూనిక్ నెస్ ని క‌లిగి ఉంటాయ‌నేది త‌న అభిమానుల అభిప్రాయం. ఇప్పుడు అలాంటి మ‌రో శారీ లుక్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:25 AM GMT
స‌నా చీర‌క‌ట్టులో సంథింగ్ ఏదో ఉందిలే
X

ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రు ఫ్యాష‌నిస్టాలు ఉన్నా ఫాతిమా సనాషేక్ అంద‌రిలో త‌నలోని విల‌క్ష‌ణ‌త‌, ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ భామ క్లాసీ లుక్స్ కి సంబంధించిన ఫోటోషూట్లు ఇప్ప‌టికే అంతర్జాలంలో హాట్ టాపిక్. ముఖ్యంగా చీర‌లో స‌నా షేక్ అంద‌చందాలు ఎప్పుడూ యూనిక్ నెస్ ని క‌లిగి ఉంటాయ‌నేది త‌న అభిమానుల అభిప్రాయం. ఇప్పుడు అలాంటి మ‌రో శారీ లుక్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది.


అయితే ఈ చీర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఇది రీసైకిల్ చేసిన కాట‌న్ తో ఫ్యాక్ట‌రీలో రూపొందించిన‌ద‌ని స‌నా షేక్ తెలిపింది. స‌నా త‌న ఇన్ స్టాలో ఈ విష‌యాన్ని షేర్ చేస్తూ చీర నేత‌కు సంబంధించిన‌ ఆస‌క్తిక‌ర విషయాల్ని రివీల్ చేసింది. "గొప్ప కథ, చరిత్ర ఉన్న ఇలాంటి చీర‌ను ధరించడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఈ చీర గురించి ఇక్కడ కొన్ని విష‌యాలున్నాయి. హిమ్రూలో రుహానీ బ్లౌజ్‌తో రాధ చీర ఇది. ఈ గొప్ప వైలెట్ రంగును పొందడానికి ఆ శారీ పీస్ ల‌కు సప్పన్ కలపతో రంగులు వేస్తారు. హిమ్రూ అనేది మహారాష్ట్రకు చెందిన వారసత్వ నేత.. ఇది రీసైకిల్ కాటన్ తో పునరుద్ధరిస్తారు. వస్త్ర వ్యర్థాలను తిరిగి ఫైబర్‌గా విచ్ఛిన్నం చేస్తారు. ఈ సాంప్రదాయ వస్త్రాన్ని చేతితో నేసే దాని నుండి కొత్త నూలును తయారు చేస్తారు" అని తెలిపింది.


అమీర్ ఖాన్ 'దంగ‌ల్' చిత్రంతో ఫాతిమా స‌నా షేక్ కెరీర్ జ‌ర్నీ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆరంగేట్ర‌మే అగ్ర‌హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుని ఆ త‌ర్వాత అత‌డితోనే ప్రేమ‌లో ప‌డ‌డంపైనా అభిమానుల్లో చ‌ర్చ సాగింది. ఈ ఏడాదితో దంగ‌ల్ ఏడేళ్లు పూర్తి చేసుకుంది.7 సంవత్సరాల దంగల్‌పై ఫాతిమా సనా షేక్ ఆస‌క్తిక‌రంగా స్పందించింది. నా సినిమా కెరీర్ భావోద్వేగాల రోలర్ కోస్టర్ రైడ్ అని వ్యాఖ్యానించింది.


2023 డిసెంబర్ 23 నాటికి దంగ‌ల్ ఏడేళ్ల మైలురాయిని అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రేక్షకులకు అద్భుత‌మైన‌ ప్రతిభను పరిచయం చేసింది. ఇందులో ఒక కీల‌క పాత్ర పోషించిన‌ ఫాతిమా సనా షేక్ పేరు మార్మోగింది. ఫాతిమా సనా షేక్ దంగల్ లో నిజ‌జీవిత‌ అథ్లెట్ గీతా ఫోగట్ పాత్ర‌లో న‌టించింది. అది తన కెరీర్‌లో గొప్ప మ‌లుపు. ఈ చిత్రం కేవలం సినిమా కళాఖండం కాదు. ఇది ఒక సాంస్కృతిక సంప‌ద‌. రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగ‌ట్ పాత్రలో న‌టించిన ఫాతిమ‌ ప్ర‌శంస‌ల‌ను పొందింది. ఏడేళ్ల కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో స‌నా షేక్ ఆక‌ట్టుకుంది. ఫాతిమా ఇటీవ‌ల సామ్ బహదూర్ లో ఇందిరా గాంధీ పాత్రలో న‌టించింది. ధ‌క్ ధ‌క్ చిత్రంలోను త‌న పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. దంగల్ నుండి ధక్ ధక్ వరకు నా సినీ కెరీర్ ఆనందం, కన్నీళ్లు, సంతోషాలు, దుఃఖాలతో కూడిన భావోద్వేగాల రోలర్ కోస్టర్ రైడ్ అని సనా ఓ ఇంట‌ర్వ్యూలో ఉద్వేగానికి గురైంది. గీతా ఫోగట్ ఎల్లప్పుడూ నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది.ఈ పాత్రకు లభించిన ప్రేమకు నేను కృతజ్ఞురాలిని అని తెలిపింది. ఫాతిమా బాలీవుడ్‌లో బహుముఖప్ర‌జ్ఞ ఉన్న తార‌ల్లో ఒకరిగా తన స్థాయిని పదిలపరుచుకుంటూ కెరీర్‌ని సాగిస్తోంది.