Begin typing your search above and press return to search.

హిట్టు హీరోయిన్ జోరు తగ్గిందేంటి..?

తెలుగులో సంయుక్తకు ఉన్న క్రేజ్ కు ఆమెకు స్టార్ ఛాన్సులు కూడా వస్తాయి. అయితే సంయుక్త మాత్రం కమర్షియల్ సినిమల్లో కూడా తన క్యారెక్టరైజేషన్ బాగుండాలని చెబుతుందట.

By:  Tupaki Desk   |   18 April 2024 5:18 AM GMT
హిట్టు హీరోయిన్ జోరు తగ్గిందేంటి..?
X

మలయాళంలో ఆల్రెడీ పాపులర్ అయిన సంయుక్త మీనన్ తెలుగులో భీంలా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రానా కి జోడీగా ఇచ్చిన చిన్న పాత్రలో కూడా అమ్మడు మెప్పించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో ఛాన్స్ అందుకున్న సంయుక్త ఆ మూవీతో కూడా హిట్ అందుకుంది. నటించిన రెండు సినిమాలు హిట్ పడటంతో సంయుక్త పేరు తెలుగులో బాగా వినపడింది. అదే క్రేజ్ తో సాయి తేజ్ తో విరూపాక్ష సినిమా చేయగా అందులో ఆమె నటనతో కూడా మెస్మరైజ్ చేసి ఇంప్రెస్ చేసింది.

విరూపాక్ష తో టాలీవుడ్ కెరీర్ లో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న సంయుక్త అదే క్రేజ్ తో కళ్యాణ్ రామ్ తో మరోసారి డెవిల్ ఛాన్స్ అందుకుంది. అయితే ఆ సినిమా కథ బాగున్నా ఎగ్జిక్యూషన్ విషయంలో లోపం వల్ల మిస్ ఫైర్ అయ్యింది. సినిమా వర్క్ అవుట్ కాకపోయినా సంయుక్త తన పోర్షన్ వరకు న్యాయం చేసింది. డెవిల్ ముందు సార్ అంటూ మరో సూపర్ హిట్ కొట్టిన సమ్యు క్త ఆమె సినిమాలో ఉంటే పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకుంది.

అయితే డెవిల్ తర్వాత మాత్రం లెక్కలు మారాయి. మరి సంయు క్త కాదంటుందో లేకా ఆమె కూడా ఫ్లాపులు ఇస్తుందనో కానీ సంయుక్త చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. హిట్టు పడితే ఎలా ఐతే ఎంకరేజ్ చేస్తారో ఫ్లాప్ వస్తే అదే రేంజ్ లో కిందకు పడేస్తారు. పరిశ్రమలో ఇలాంటివి చాలా కామన్ కానీ సంయుక్త మాత్రం మళ్లీ తన సత్తా చాటేందుకు కృషి చేస్తుంది. సినిమా ఛాన్సులు వస్తున్నా ఏది పడితే అది చేయడం కాదు తన స్టామినా ప్రూవ్ చేసే సినిమా చేయాలని అమ్మడు ఫిక్స్ అయ్యింది.

తెలుగులో సంయుక్తకు ఉన్న క్రేజ్ కు ఆమెకు స్టార్ ఛాన్సులు కూడా వస్తాయి. అయితే సంయుక్త మాత్రం కమర్షియల్ సినిమల్లో కూడా తన క్యారెక్టరైజేషన్ బాగుండాలని చెబుతుందట. అందుకే ఆమెకు వెంట వెంట ఛాన్సులు రావట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతం మాతృ భాష మలయాళంలోనే సినిమాలు చేస్తున్న సంయుక్త కచ్చితంగా తెలుగులో మళ్లీ కంబ్యాక్ ఇస్తుందని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. తెలుగు ఆఫర్లు కూడా కొన్ని డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుండగా వాటి గురించి త్వరలో వివరాలు బయటకు రానున్నాయి.