Begin typing your search above and press return to search.

సంయుక్త కూడా బాగానే డిమాండ్ చేస్తుందా..?

వారికి ఇచ్చిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు ఈ భామలు

By:  Tupaki Desk   |   15 Aug 2023 11:30 PM GMT
సంయుక్త కూడా బాగానే డిమాండ్ చేస్తుందా..?
X

మలయాళ భామలకు టాలీవుడ్ లో డిమాండ్ గురించి తెలిసిందే. వారికి ఇచ్చిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు ఈ భామలు. ఇప్పటికే మలయాళ హీరోయిన్స్ చాలమంది తెలుగు పరిశ్రమలో సత్తా చాటుతుండగా ఈమధ్యనే వచ్చి తన టాలెంట్ చూపిస్తూ వరుస హిట్లు కొడుతున్న సం యుక్త కూడా టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్, రానా నటించిన భీంలా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త మీనన్ ఆ సినిమా హిట్ అందుకోగా ఆ వెంటనే కళ్యాణ్ రాం బింబిసారతో కూడా హిట్ కొట్టేసింది.

ఇక ధనుష్ హీరోగా వచ్చిన సార్ సినిమాలో కూడా సంయుక్త నటించగా ఆ సినిమాతో కూడా హిట్ ఖాతాలో వేసుకుంది అమ్మడు. సార్ తర్వాత అవకాశాలు వస్తున్నా తనకు నచ్చిన కథలనే ఓకే చెప్పాలని ఫిక్స్ అయిన సం యుక్త సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రాం డెవిల్ లో నటిస్తున్న ఈ హీరోయిన్ నిఖిల్ లీడ్ రోల్ లో వస్తున్న స్వయంభు సినిమాకు కూడా సైన్ చేసినట్టు తెలుస్తుంది. కార్తికేయ 2 తో నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన నిఖిల్ తను చేస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే భారతి కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిఖిల్ స్వయంభు సినిమాలో సంయుక్తని హీరోయిన్ గా తీసుకున్నారు. నిఖిల్ తో సినిమా పాన్ ఇండియా మైలేజ్ వస్తుందని సంయుక్త ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఆల్రెడీ హిట్ ఫాం లో ఉంది కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చి సినిమాలో తీసుకున్నారట మేకర్స్. భీమ్లా నాయక్, బింబిసార సినిమాలకు కోటి లోపే రెమ్యునరేషన్ అందుకున్న సంయుక్త సార్ కి బాగానే పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది.

నిఖిల్ స్వయంభు సినిమాలో ఆమె నటించేందుకు కోటి నుంచి కోటిన్నర దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో గోల్డెన్ లెగ్ గా క్రేజ్ తెచ్చుకున్న సంయుక్తకి ఈ పారితోషికం ఇవ్వడంలో తప్పేం లేదని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. నిఖిల్ స్వయంభుతో పాటుగా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. నిఖిల్ స్వయంభుతో అమ్మడికి పాన్ ఇండియా క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.