Begin typing your search above and press return to search.

ఆరేళ్ల కి మేడంకు ఆ అవకాశం..!

టాలీవుడ్‌ ప్రేక్షకులకు భీమ్లా నాయక్‌, బింబిసార, విరూపాక్ష సినిమాలతో దగ్గరైన మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌

By:  Tupaki Desk   |   16 April 2024 8:09 AM GMT
ఆరేళ్ల కి మేడంకు ఆ అవకాశం..!
X

టాలీవుడ్‌ ప్రేక్షకులకు భీమ్లా నాయక్‌, బింబిసార, విరూపాక్ష సినిమాలతో దగ్గరైన మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌. ధనుష్ తో కలిసి తమిళంలో ఈ అమ్మడు చేసిన సార్ సినిమాలో మేడం గా నటించి మెప్పించింది. తెలుగు సినిమాలకు సరిగ్గా సెట్‌ అయ్యే పర్సనాలిటీ మరియు బాడీ లాంగ్వేజ్ అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఈ అమ్మడి సినిమాలు వచ్చాయి. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తోంది. శర్వానంద్ తో కలిసి ఒక సినిమాను చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు నిఖిల్‌ తో కూడా ఒక సినిమాకు కమిట్‌ అయ్యింది.

ఇక తమిళంలో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ వివిధ దశల్లో మూడు నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయట. ఈ అమ్మడు మలయాళ సినిమాలతో ఆరు ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇన్నాళ్లు సౌత్‌ లో మాత్రమే ఈ అమ్మడి సందడి కొనసాగింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆరు సంవత్సరాల తర్వాత ఈ మేడం కి బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. చాలా మంది సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్‌ లో సినిమా ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మడు పెద్దగా కష్టపడకుండానే హిందీ సినిమా ఆఫర్‌ వచ్చిందని సమాచారం అందుతోంది.

ప్రముఖ బాలీవుడ్‌ యంగ్‌ హీరో సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం సంయుక్త మీనన్‌ ను సంప్రదించడం జరిగింది. ఈమె ఓకే చెప్పడంతో వెంటనే లుక్ టెస్ట్ కి వారు ముంబై కి ఆహ్వానించారని తెలుస్తోంది. ఒక వేళ సంయుక్త కనుక ఆ లుక్ టెస్ట్ లో సక్సెస్ అయితే వెంటనే హిందీ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్‌ లో జెండా పాతిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది. కొద్ది మంది కొన్నాళ్ల పాటు సందడి చేసినా కూడా సుదీర్ఘ కాలం పాటు బాలీవుడ్‌ లో కొనసాగింది, కొనసాగుతున్నది చాలా చాలా తక్కువ మంది. కనుక సంయుక్త మీనన్ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి.

హిందీ లో వరుసగా సినిమాలు చేస్తే సంయుక్త సౌత్‌ సినిమాలను తగ్గించడంతో పాటు, పారితోషికం పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ ఏడాది లో సంయుక్త కెరీర్ లో అత్యంత కీలకంగా ఆమె సన్నిహితులు మరియు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.