Begin typing your search above and press return to search.

డెవిల్.. అందమైన దేవతలా సంయుక్తా..

నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఆయన ప్రతిసారీ డిఫరెంట్ సినిమాలనే ఎంచుకుంటారు

By:  Tupaki Desk   |   11 Sep 2023 7:10 AM GMT
డెవిల్.. అందమైన దేవతలా సంయుక్తా..
X

నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఆయన ప్రతిసారీ డిఫరెంట్ సినిమాలనే ఎంచుకుంటారు. ప్రతిసారీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉ:టారు. గతేడాది బింబిసార మూవీతో వచ్చాడు, డ్యూయల్ రోల్ లో సోషియో ఫాంటసీ కథతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అమిగోస్ మూవీతో వచ్చాడు. అందులో ఏకంగా త్రిపుల్ రోల్ ప్లే చేశాడు. కానీ, ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.


కాగా, తాజాగా ఆయన డెవిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ నటిస్తోంది. తాజాగా ఆమె లుక్ ని విడుదల చేశారు. ఈ లుక్ లో సంయుక్తా మీనన్ దేవతలా కనపడుతోంది. ఎరుపు రంగు పట్టుచీర, ఆకుపచ్చ జాకెట్ , కళ్లకు కాటుకలా, చేతిలో పూల సజ్జ పట్టుకొని కుందనపు బొమ్మలా ఉంది. ఆమె బ్యాగ్రౌండ్ లో ఆలయాలు కనపడుతున్నాయి.

అలా చీరకట్టుకొని ఆమె గుడికి వెళ్తున్నట్లుగా ఆ ఫోటో ద్వారా తెలుస్తోంది. ఈ లుక్ ఇప్పుడు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంయుక్తా మీనన్ తెలుగులో వరసగా సినిమాలు చేస్తోంది. బింబిసారా, సర్, విరూపాక్ష వంటి హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఈ మూవీతో మరో హిట్ అందుకోనుందని అర్థమౌతోంది.

ఇక, ఈ సినిమాకి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ , పోస్టర్లు ఈ మూవీపై ఆసక్తి పెంచేశాయి. ఇక, సంయుక్త లుక్ మరింత బాగుండటం విశేషం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటీష్ వారి హయాంలో వాళ్ల ఏజెంట్ గా పని చేసిన ఓ వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ

ఈ సినిమా కి సౌంద‌ర్ రాజ‌న్ ఎస్ ఫోటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా క‌థ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఇక, ఈ మూవీ నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.