Begin typing your search above and press return to search.

డెవిల్ హీరోయిన్ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే హిట్ పక్కా అనే క్రేజ్ తెచ్చుకుంది కాబట్టి దానికి తగినట్టుగానే డెవిల్ రిజల్ట్ వస్తే మాత్రం ఆమెని ఆపడం కష్టమని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   14 Dec 2023 1:30 AM GMT
డెవిల్ హీరోయిన్ సెంటిమెంట్ కలిసొస్తుందా..?
X

నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మించిన సినిమా డెవిల్. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మళయాళ భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. పీరియాడికల్ మూవీగా బ్రిటీష్ కాలం నాటి కథతో డెవిల్ ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.

బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తో ఫ్లాప్ అందుకున్నాడు. డెవిల్ తో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. డెవిల్ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించడం కూడా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన అమ్మడు తెలుగులో వరుస హిట్లు అందుకుంటుంది. భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష ఇలా హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తుంది సంయుక్త మీనన్. తన లక్కీ ఛార్మ్ ఈ సినిమాకు కూడా కలిసి రావాలని చూస్తుంది. ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే హిట్ పక్కా అనే క్రేజ్ తెచ్చుకుంది కాబట్టి దానికి తగినట్టుగానే డెవిల్ రిజల్ట్ వస్తే మాత్రం ఆమెని ఆపడం కష్టమని చెప్పొచ్చు.

డెవిల్ సినిమా ట్రైలర్ తో బజ్ పెంచే ప్రయత్నం చేసినా సినిమా దర్శకుడి మార్పు సందేహాలకు దారి తీస్తుంది. అయితే వివాదం పెద్దది కాకుండానే చూశారు. ఈ సినిమాకు కూడా సంయుక్త హిట్ సెంటిమెంట్ కలిసి వస్తుందేమో చూడాలి. టాలీవుడ్ లక్కీ హ్యాండ్ గా మారిన సంయుక్త మీనన్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. అయితే డెవిల్ సినిమా సక్సెస్ అయితే మాత్రం అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

ఆల్రెడీ కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాలో నటించిన సంయుక్త మీనన్ ఆ సినిమా ఫలితాన్ని రిపీట్ చేస్తుదేమో చూడాలి. ఇక కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే డెవిల్ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాతో పాటుగా దేవర ప్రొడక్షన్ లో కూడా భాగం అవుతున్నారు నందమూరి హీరో. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ బింబిసార తరహాలోనే ఉంది. అందుకే నందమూరి ఫ్యాన్స్ డెవిల్ కూడా ఆ సినిమా రేంజ్ సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నారు.