Begin typing your search above and press return to search.

వాటి మీదే ఆశలు పెట్టుకున్న బ్యూటీ..!

బాలయ్య తో ఛాన్స్ తప్పకుండా అమ్మడి కెరీర్ కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఐతే అఖండ 2 లో సంయుక్త రోల్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

By:  Tupaki Desk   |   15 Jun 2025 3:00 AM IST
వాటి మీదే ఆశలు పెట్టుకున్న బ్యూటీ..!
X

మలయాళ భామ సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమెకు ఇచ్చిన పాత్రలో ఇంప్రెస్ చేసింది అమ్మడు. ఆ తర్వాత విరూపాక్ష, సార్ సినిమాలతో మెప్పించింది. తెలుగులో వచ్చిన పాపులారిటీతో తమిళ్ లో కూడా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది సంయుక్త. ప్రస్తుతం అమ్మడు తెలుగులో స్వయంభు, నారి నారి నడుమ మురారి సినిమాల్లో నటిస్తుంది. నిఖిల్ స్వయంభు సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది. ఆ సినిమా కోసం సంయుక్త కూడా గుర్రపు స్వారి నేర్చుకుని మరీ యాక్షన్ సీన్స్ చేసిందని టాక్.

ఇక ఈ సినిమాతో పాటు శర్వానంద్ తో నారి నారి నడుమ మురారి సినిమా చేస్తుంది సంయుక్త మీనన్. ఆ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈమధ్యనే నారి నారి నడుమ మురారి సినిమా నుంచి వచ్చిన సాంగ్ ఒకటి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలే కాదు అమ్మడు బాలకృష్ణ అఖండ 2 లో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అఖండ లో ప్రగ్యా నటించగా అఖండ 2 లో సంయుక్త ఛాన్స్ అందుకుంది.

బాలయ్య తో ఛాన్స్ తప్పకుండా అమ్మడి కెరీర్ కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఐతే అఖండ 2 లో సంయుక్త రోల్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే సంయుక్త తెలుగులో ఎందుకో వెనకబడింది. రాబోతున్న రెండు సినిమాల మీదే సంయుక్త తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాల ఫలితాల మీదే ఈ హీరోయిన్ నెక్స్ట్ సినిమాల అవకాశాలు ఉంటాయి. మరి ఈ రెండిటితో సంయుక్త తిరిగి హిట్ ట్రాక్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.

సంయుక్త మీనన్ ని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. ఐతే సంయుక్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కి దూరంగా ఉంటుంది. యువతని మెప్పించాలంటే లవ్ స్టోరీస్ లో నటించాలి. కానీ తెలుగులో సంయుక్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తుంది. అందుకే ఆమెకు అంతగా హైప్ రావట్లేదు. ఇప్పటికైనా సంయుక్త తన పంథా మార్చి యూత్ టార్గెట్ సినిమాల్లో నటిస్తే కెరీర్ కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అసలే టాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య ఒక రేంజ్ లో ఫైట్ ఉంటుంది. ఇక్కడ నెగ్గాలంటే మాత్రం రకరకాలుగా ప్రయత్నాలు చేయాల్సిందే. మరి సంయుక్త మీనన్ రాబోతున్న సినిమాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.