పిక్ టాక్ : ఎర్ర చీర కట్టులో సంయుక్త
రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంయుక్త మీనన్ తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 19 April 2025 7:07 AMమలయాళ సినిమా పాప్‌కార్న్‌తో దాదాపు దశాబ్ద కాలం క్రితం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. వరుసగా మలయాళ సినిమాలు చేస్తూ వచ్చిన ఈమెకు 2018లో కలరి అనే తమిళ సినిమాలో నటించే అవకాశం దక్కింది. అత్యధిక మలయాళ సినిమాల్లో నటించిన సంయుక్త మీనన్ ఆ తర్వాత తమిళ్‌లో ఎక్కువ సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా పలు సినిమాలతో సుపరిచితురాలు అయింది. తెలుగులో ఈమె భీమ్లా నాయక్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడికి విరూపాక్ష సినిమాతో భారీ విజయం దక్కింది.
తెలుగులో వరుసగా సార్, విరూపాక్ష, బింబిసార సినిమాలతో సక్సెస్‌లు దక్కాయి. దాంతో ఈ అమ్మడు ఎక్కువ ఆఫర్లు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈమె మూడు సినిమాల్లో నటిస్తోంది. మూడు సినిమాలు సైతం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అఖండ 2 సినిమాలోనూ ఈమె కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు. నారి నారి నడుమ మురారి సినిమాలోనూ ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. గతంతో పోల్చితే తెలుగులో ఈ సారి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్న సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంయుక్త మీనన్ తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 3.3 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈమె మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి చీర కట్టు ఫోటోలతో సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే అందమైన ఎర్ర చీర కట్టు ఫోటోలతో సంయుక్త మీనన్ వైరల్ అవుతోంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి, రెడ్ చీర కట్టులో అందంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన సంయుక్త మీనన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
2016లో షైన్ టామ్ చాకో కు జోడీగా పాప్‌కార్న్ సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తక్కువ సమయంలోనే సంయుక్తకి మలయాళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉన్న సంయుక్త మీనన్ కాస్త ఆలస్యంగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకు పోతుంది. అందమైన ఈ మలయాళి ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో రాబోయే రెండు మూడు ఏళ్లలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేస్తే మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.