Begin typing your search above and press return to search.

2025 లో ఒకే ఒక్క‌డులా అమ్మ‌డు విధ్వంసం!

`విరూపాక్ష` త‌ర్వాత సంయుక్తా మీన‌న్ అల‌జ‌డే క‌నిపించ‌లేదు. చెప్పుకోవ‌డానికి రెండు సినిమాలు చేసింది గానీ అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియ‌దు.

By:  Tupaki Desk   |   18 May 2025 1:54 PM IST
2025 లో ఒకే ఒక్క‌డులా అమ్మ‌డు విధ్వంసం!
X

`విరూపాక్ష` త‌ర్వాత సంయుక్తా మీన‌న్ అల‌జ‌డే క‌నిపించ‌లేదు. చెప్పుకోవ‌డానికి రెండు సినిమాలు చేసింది గానీ అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియ‌దు. ప్లాప్ చిత్రాలు కావ‌డంతో వాటి గురించి ప్ర‌చారంలోకి రాలేదు. అయితే విరూపాక్ష లాంటి 100 కోట్ల వ‌సూళ్ల సినిమా ఉన్నా త‌దుప‌రి అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. అందుకు అమ్మ‌డి స్వ‌యంకృప‌రాధం కూడా కొంత ఉంది.

`విరూపాక్ష` స‌క్సెస్ త‌ర్వాత సంయుక్తా మీన‌న్ లేడీ ఓరియేంటెడ్ క‌థ‌ల‌పై ఆస‌క్తి మ‌ళ్లించింది. సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ ఛాన్సులివ్వ‌లేదు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన కొన్ని హీరోయిన్ అవ‌కాశాలు వ‌దులుకుంది. అలా కొంత గ్యాప్ ఏర్ప‌డింది. దీంతో సంయుక్తా మీన‌న్ ఏమైపోయిందంటూ చ‌ర్చ‌కు దారి తీసింది. మ‌రో భాష‌లో బిజీగా ఉంటే ? టాలీవుడ్ ని లైట్ తీసుకుంద‌నుకోవ‌చ్చు. కానీ అక్క‌డా ఎలాంటి ఛాన్సులు రాలేదు.

గ‌త ఏడాది `ల‌వ్ మీ` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆ సినిమా గురించి చాలా మందికి తెలియ దు. ఈ ఏడాది మాత్రం ఒక్క చిత్రంతోనే అల‌రించే అవ‌కాశం ఉంది. మిగిలిన చిత్రాలన్నీ వ‌చ్చే ఏడాది మాత్ర‌మే రిలీజ్ అవుతున్నాయి. సినిమాల సంఖ్య మాత్రం ఎక్కువ‌గానే ఉంది. బాలీవుడ్ లో `మ‌హారాణీ క్వీన్ ఆఫ్ క్వీన్స్` లో న‌టిస్తోంది. ఇదే బాలీవుడ్ లో డెబ్యూ చిత్రం. అలాగే నిఖిల్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం `స్వ‌యంభు`లో న‌టిస్తోంది.

`నారీ నారీ న‌డుమ మురారీ`, `హైంద‌వ` చిత్రాల‌తో పాటు మాలీవుడ్ లో `రామ్` లో న‌టిస్తోంది. ఇవ‌న్నీ కూడా వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడాది మాత్రం `అఖండ 2`తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో న‌ట‌సింహ బాల‌కృష్ణ‌కు జోడీగా న‌టిస్తోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై పాన్ ఇండియాలో భారీ అంచ‌నాలున్నాయి.