లేడీ క్వీన్‌తో సంయుక్త డేరింగ్ ఎంట్రీ!
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న `అఖండ 2`లో నటిస్తోంది.
By: Tupaki Desk | 17 Jun 2025 5:00 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన యాక్షన్ ఎమోషనల్‌డ్రామా `భీమ్లానాయక్`. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కోవిడ్ టైమ్‌లోనూ ఏ స్థాయిలో సందడి చేసిందో అందరికి తెలిసిందే. ఇదే మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది మలయాళ సోయగం సంయుక్తమీనన్. ఆ తరువాత కల్యాణ్ రామ్ `బింబిసార, డెవిల్, ధనుష్ `సార్`, సాయి ధరమ్ తేజ్‌తో `విరూపాక్ష` చిత్రాల్లో నటించి వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న `అఖండ 2`లో నటిస్తోంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. నిఖిల్‌తో `స్వయంభు`లోనూ నటిస్తున్న సంయుక్త తాజాగా క్రేజీ ఆఫర్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వెర్సటైల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లోనూ నటించే ఆఫర్‌ని దక్కించుకుంది. విజయ్ సేతుపతి హీరోగా పూరి ఓ భారీ యాక్షన్, ఎమోషనల్ డ్రామాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టాబుతో పాటు సంయుక్త మీనన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది.
ఇవన్నీ పక్కన పెడితే సంయుక్త ఈ ఏడాది డేరింగ్ స్టెప్‌కు రెడీ అయిపోయింది. అదే బాలీవుడ్ ఎంట్రీ. బాలీవుడ్‌లో క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకున్న కాజోల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ని దూకుడుగా ప్రారంభించి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే కాజోల్ నటించిన పవర్‌ఫుల్ లేడీ ఓరియెండెట్ ఫిల్మ్ `మా` రిలీజ్‌కు రెడీ అవుతోంది. జూన్ 27న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. దీనితో పాటు కాజోల్ మరో పవర్ ఫుల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అదే `మహారాగ్ని : క్వీన్ ఆఫ్ క్వీన్స్`. ఈ సినిమాతో తెలుగు యువకుడు చంద్రన్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రభుదేవా, నసీరుద్దీన్ షా, జిస్సుసేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ద్వారా సంయుక్త మీనన్ బాలీవుడ్‌కు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో కాజోల్ కూతురిగా సంయుక్త కనిపించబోతోంది. హిందీలో రూపొందుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
