Begin typing your search above and press return to search.

సంయుక్త.. అఖండతో ఆ లిస్ట్ లో చేరుతుందా?

యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్.. ఇప్పుడు అఖండ 2: ది తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Dec 2025 7:00 AM IST
సంయుక్త.. అఖండతో ఆ లిస్ట్ లో చేరుతుందా?
X

యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్.. ఇప్పుడు అఖండ 2: ది తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్న సంయుక్త.. ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు.

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 మూవీ రూపొందగా.. సంయుక్త రోల్ చాలా స్ట్రాంగ్ ఉంటుందని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడంతోపాటు ప్రమోషనల్ కంటెంట్ పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో.. సంయుక్త మీనన్ కు భారీ హిట్ దక్కుతుందని అంచనాలు ఉన్నాయి.

అయితే అదే జరిగితే.. అమ్మడు అరుదైన లిస్ట్ లో చేరనుంది. అదేంటంటే.. ఒకే ఫ్యామిలీ నుంచి రెండు తరాల హీరోలతో యాక్ట్ చేసి హిట్స్ అందుకున్న హీరోయిన్ల లిస్ట్. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆ జాబితాలో ఉండగా.. ఇప్పుడు సంయుక్త మీనన్ కూడా చేరే అవకాశం ఉందని అటు సినీ ప్రియులు.. ఇటు సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్యతో ఇప్పుడు యాక్ట్ చేస్తున్న సంయుక్త.. అదే కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామ్ తో ఇప్పటికే జత కట్టారు. అది కూడా రెండు సార్లు ఆయన సరసన నటించారు. తొలుత 2022లో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార మూవీ చేసి సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత డెవిల్ చేసినా.. అనుకున్నంత స్థాయిలో మూవీ ఆడలేదు.

దీంతో అప్పుడు కళ్యాణ్ రామ్ తో హిట్ అందుకున్న సంయుక్త.. ఇప్పుడు బాలయ్యతో మంచి విజయం సొంతం చేసుకుంటే.. క్రేజీ లిస్ట్ లో ఆమెకు ప్లేస్ దక్కనుంది. అదే సమయంలో అఖండ ఫస్ట్ పార్ట్ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. ఇప్పుడు సీక్వెల్ లో సంయుక్త యాక్ట్ చేసింది. అందుకే ఆమె యాక్టింగ్ పై అందరి ఫోకస్ ఉండనుంది.

అయితే సంయుక్త టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వివిధ సినిమాల్లో యాక్టింగ్ తో ఓ రేంజ్ లో మెప్పించారు. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా విరూపాక్షలో తన నటనతో ఫిదా చేశారు. యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు అఖండతో ఎంతలా అలరిస్తారో చూడాలి.