Begin typing your search above and press return to search.

LCU లో ఇది మరో బిగ్ సర్ ప్రైజ్!

రఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బెంజ్ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 8:00 PM IST
LCU లో ఇది మరో బిగ్ సర్ ప్రైజ్!
X

రఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బెంజ్ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో మలయాళ స్టార్ నటుడు నివిన్ పాలి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. లారెన్స్, నివిన్ పాలి కాంబినేషన్‌కు తోడు సినిమాలో గ్లామర్ బ్యూటీస్ ఎంట్రీ ఇవ్వడం ప్రాజెక్ట్‌ను మరింత హైప్‌కు గురి చేసింది.

ఈ సినిమాలో హీరోయిన్‌లుగా విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్, ప్రియాంక అరుల్ మోహన్, మడోనా సెబాస్టియన్‌లు నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు గతంలో మంచి విజయాలను అందుకున్నా, గత కొంతకాలంగా వారికి పెద్దగా బ్రేక్ రాలేదు. ఇప్పుడు బెంజ్ రూపంలో మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారనే చెప్పాలి. సినిమాలో వీళ్ల పాత్రలు మాస్‌, స్టైల్‌, ఎమోషన్ అన్నీ కలిపిన విధంగా ఉండనున్నాయని సమాచారం.

ఈ సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ప్రస్తుతం ట్రేడ్‌లో చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి. విక్రమ్, లియో సినిమాల తెలుగు వెర్షన్ లు మంచి లాభాలు ఇవ్వడంతో బెంజ్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా రజినీకాంత్ జైలర్ కూడా తెలుగులో మంచి ప్రాఫిట్‌ను అందించిన నేపథ్యంలో, ఈసారి కూడా టాలీవుడ్ బయ్యర్లు ముందుగానే ఆసక్తి చూపిస్తున్నారు. లారెన్స్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో ఈ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నట్లు టాక్.

బెంజ్ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకుడు కాగా, కథను మాత్రం లోకేష్ కనగరాజ్ అందించడంతో ఇది ఎల్సీయూ ఫ్రాంచైజ్‌లో మిగిలిన సినిమాలకు లింక్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లోకేష్ యూనివర్స్‌లోని హీరోల కోసం ప్రత్యేక ట్రాక్‌లు సిద్ధం అవుతున్నాయి. దీనివల్ల బెంజ్‌కి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. పైగా ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండడం మరో ప్లస్ పాయింట్.

ఒకవేళ ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో హిట్ అయితే, లారెన్స్‌కి ఇది మళ్లీ మాస్ హీరోగా రీ ఎంట్రీ అవుతుంది. అలాగే సంయుక్త, మడోనా, ప్రియాంక లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్‌కి ఇది మంచి కెరీర్ బ్రేక్ అవ్వవచ్చు. కథ, తారాగణం, యాక్షన్ బ్లాక్స్, మ్యూజిక్ అన్నీ ఈసారి మాస్ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇకపై బెంజ్ కి సంబంధించి రిలీజ్ డేట్, ఫస్ట్ గ్లింప్స్ లాంటి అప్డేట్స్ రావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎల్సీయూ అభిమానులు మాత్రం ఈ సినిమా కథలో ఎలాంటి లింక్స్ ఉన్నాయో, రోల్ ఆఫ్ లోకేష్ యూనివర్స్ ఎలా ఉంటుందో అనే విషయాల్లో ఆసక్తిగా ఉన్నారు.