Begin typing your search above and press return to search.

సంయుక్త ప్లానింగ్ మామూలుగా లేదుగా

ఈ ప్రాజెక్ట్‌తో సంయుక్త ఖాతాలో మొత్తం ఏడు సినిమాలు వ‌చ్చి చేరాయి. ప్ర‌స్తుతం త‌ను బ్యాక్ టు బ్యాక్ 7 క్రేజీ ప్రాజెక్ట్స్‌లలో న‌టిస్తూ బిజీగా ఉంది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 10:21 AM IST
సంయుక్త ప్లానింగ్ మామూలుగా లేదుగా
X

సంయుక్త‌మీన‌న్‌..కేర‌ళ పాల‌క్కాడ్‌కు చెందిన ఈ మ‌ల‌యాళీ సోయ‌గం గ‌త కొంత కాలంగా తెలుగులో వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న హీరోల‌కు హిట్‌ల‌ని అందిస్తూ ఇండ‌స్ట్రీలో ల‌క్కీ హీరోయిన్‌గా మారిన సంయుక్త మీన‌న్ ఇప్పుడు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ అని తేడా లేకుండా అన్నీ భాష‌ల్లీ చుట్టేస్తూ క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని సొంతం చేసుకుంటోంది.

ప‌వ‌న్‌, రానాల సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సంయుక్త అదే ఊపులో క్రేజీ స్టార్ల‌తో క‌లిసి న‌టిస్తూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా రామ్ చ‌ర‌ణ్ త‌న స్నేహితుడితో క‌లిసి నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ,స్వ‌యంభు,తో పాటు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న భారీ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామా ,అఖండ‌2,లోనూ న‌టిస్తోంది. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా మ‌రో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అదే పూరి జ‌గ‌న్నాథ్ ఫిల్మ్‌. ఈ ప్రాజెక్ట్‌తో సంయుక్త ఖాతాలో మొత్తం ఏడు సినిమాలు వ‌చ్చి చేరాయి. ప్ర‌స్తుతం త‌ను బ్యాక్ టు బ్యాక్ 7 క్రేజీ ప్రాజెక్ట్స్‌లలో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇదే ఏడాది కాజోల్‌తో న‌టిస్తున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ,మ‌హారాగ్ని:క్వీన్ ఆఫ్ క్వీన్స్‌,తో బాలీవుడ్ బాట‌ప‌డుతోంది. ఇక తెలుగులో శ‌ర్వానంద్ హీరోగా రూపొందుతున్న ,నారీ నారీ న‌డుమ మురారీ,లోనూ న‌టిస్తోంది. సంయుక్త న‌టిస్తున్న మ‌రో తెలుగు సినిమా ,హైంద‌వ‌,.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ మూవీని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌తో ,రామ్‌,లోనూ న‌టిస్తోంది సంయుక్త‌. దీని షూటింగ్ ఆగిపోయింది. తిరిగి త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇక వీటితో పాటు ఇదే ఏడాది లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లోకి అడుగుపెడుతోంది. రాఘ‌వ‌లారెన్స్ హీరోగా భాగ్య‌రాజ్ క‌న్న‌న్‌తో లోకేష్ క‌న‌గ‌రాజ్ ,బెంజ్‌, మూవీని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో లారెన్స్‌కు జోడీగా సంయుక్త న‌టిస్తోంది. ఇలా వ‌రుస‌గా 7 క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో ఈ ఏడాది సంయుక్త డైరీ ఫుల్ కావ‌డంతో ఆమె ప్లానింగ్ మామూలుగా లేదుగా అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.