గ్యాప్ ను పూరించాలని చూస్తోన్న సంయుక్త!
గతేడాది వచ్చిన గ్యాప్ ను ఫుల్‌ఫిల్ చేయడానికి ఇప్పుడు సంయుక్త చాలా గట్టిగా ట్రై చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఆరు సినిమాలున్నాయి. ఆ ఆరు ప్రాజెక్టుల్లో మూడు మైథాలాజికల్ సినిమాలే అవడం విశేషం.
By: Tupaki Desk | 29 April 2025 2:00 AM ISTసినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఎలా ఛాన్సులొచ్చి బిజీ అయిపోతారో తెలియదు. అందుకే అంటారు ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారానికి స్టార్లు మారుతూ ఉంటారని. అలా సడెన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి ఆ సినిమాలో రానాకు జోడీగా నటించి అందరి కళ్లలో పడింది సంయుక్త మీనన్.
మొదటి సినిమానే పవన్ సినిమా కావడం, దానికి తోడు ఆ సినిమా హిట్ అవడంతో సంయుక్తకు ఆఫర్లు క్యూ కట్టాయి. రెండో సినిమాగా కళ్యాణ్ రామ్ తో బింబిసార చేసింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మూడో సినిమాగా సార్ సినిమాను ధనుష్ తో కలిసి చేసి మరో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది సంయుక్త.
దీంతో కెరీర్ స్టార్టింగ్ లోనే బ్యాక్ టు బ్యాక్ విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న లక్కీ హీరోయిన్ గా సంయుక్త మారిపోయింది. సార్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా చేస్తే ఆ సినిమా అందరినీ ఆకట్టుకుంది. విరూపాక్షలో ఏకంగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి అందరినీ ఆశ్చర్యపరించింది సంయుక్త.
విరూపాక్ష తర్వాత సంయుక్త డిమాండ్, క్రేజ్ మరింత పెరిగాయి. దీంతో అమ్మడికి ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. విరూపాక్ష తర్వాత రెండోసారి కళ్యాణ్ రామ్ తో డెవిల్ సినిమా కోసం జతకడితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే సంయుక్త నుంచి డెవిల్ తర్వాత మరో సినిమా వచ్చింది లేదు. సంయుక్త చేతిలో పలు ప్రాజెక్టులున్నప్పటికీ గతేడాది మాత్రం తన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.
గతేడాది వచ్చిన గ్యాప్ ను ఫుల్‌ఫిల్ చేయడానికి ఇప్పుడు సంయుక్త చాలా గట్టిగా ట్రై చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఆరు సినిమాలున్నాయి. ఆ ఆరు ప్రాజెక్టుల్లో మూడు మైథాలాజికల్ సినిమాలే అవడం విశేషం. వాటిలో నిఖిల్ తో చేస్తున్న స్వయంభు, బెల్లంకొండ శ్రీనివాస్ హైంధవ, బాలయ్యతో చేస్తున్న అఖండ2 ఉన్నాయి. ఇవి కాకుండా శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారీతో పాటూ బాలీవుడ్ లో మహారాగ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్ అనే సినిమా కూడా చేస్తోంది సంయుక్త. వాటిలో నారీ నారీ నడుమ మురారి సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ కానుండగా, అఖండ2 సెప్టెంబరులో రిలీజ్ కానుంది. ఎంతలేదన్నా ఈ ఇయర్ సంయుక్త నుంచి మూడు సినిమాలు రావడం పక్కా అని ఆమె లైనప్ చూస్తుంటే అర్థమవుతోంది.
