Begin typing your search above and press return to search.

సంయుక్త డివోషనల్ మోడ్..!

మలయాళంలో సినిమాలు చేస్తూ తన ప్రతిభ చాటుతూ వస్తున్న సంయుక్త తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో తొలి ఛాన్స్ అందుకుంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 5:18 PM GMT
సంయుక్త డివోషనల్ మోడ్..!
X

మలయాళంలో సినిమాలు చేస్తూ తన ప్రతిభ చాటుతూ వస్తున్న సంయుక్త తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో తొలి ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మడికి వరుస సినిమా ఛాన్స్ లు వచ్చాయి. విరూపాక్ష, సార్ సినిమాలు సక్సెస్ అవ్వడంతో అమ్మడు ఇక దూసుకెళ్తుందని అనుకోగా డెవిల్ ఫ్లాప్ తో డీలా పడింది. నెక్స్ట్ సినిమాల అవకాశాలు కూడా మందగించాయి. ఐతే ఈమధ్యనే అఖండ 2లో అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. బాలకృష్ణతో సినిమా అంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. సో అఖండ 2 సంయుక్తకి కచ్చితంగా కలిసి వచ్చేలా ఉందని చెప్పొచ్చు.

ఈ సినిమాతో పాటు నిఖిల్ తో స్వయంభు సినిమా కూడా చేస్తుంది అమ్మడు. స్వయంభు కోసం హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటుంది సంయుక్త. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రయాగ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసింది సంయుక్త. మహా కుంభమేళాకి వెళ్లిన సంయుక్త అక్కడ ఫోటోని షేర్ చేస్తూ గంగానదిలో పవిత్ర స్నానం ఎప్పటికీ ఉత్సాహాన్ని ఇస్తుంది.. జీవితం యొక్క విశాలత కళ్లారా చూసినప్పుడే దాని అర్ధాన్ని మరింత తెలుసుకోగలం అని రాసుకొచ్చింది.

తనకు ఇచ్చిన పాత్రలో ది బెస్ట్ ఇస్తూ సంయుక్త సత్తా చాటుతూ వస్తుంది. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత తన పంథా మార్చేయాలని ఫిక్స్ అయ్యింది సంయుక్త. ఇక్కడ గ్లామర్ పరంగా కూడా ఛాన్స్ లు కొట్టేయాలని చూస్తుంది అమ్మడు. అందుకే సినిమాల్లో అవకాశం ఉన్నా లేకపోయినా ఫోటో షూట్స్ రూపంలో స్కిన్ షో చేస్తుంది. యువ హీరోలతో పాటు సీనియర్ స్టార్స్ కి అమ్మడు హీరోయిన్ గా చేస్తూ వస్తుంది.

తెలుగుతో పాటు సంయుక్తకి తమిళ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే సంయుక్త మాత్రం తెలుగు సినిమాలు చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఐతే అమ్మడు చేసిన సినిమాలు కమర్షియల్ హిట్లు కొడుతున్నా కూడా పర్సనల్ గా తన క్రేజ్ పెంచుకోవడంలో వెనకపడింది సంయుక్త. అందుకే ఇక టాప్ గేర్ మార్చి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. సంయుక్త ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చేలా ఉన్నాయి.