చీరలో సంయుక్తా… ట్రెడిషనల్ టచ్‌తో గ్లామర్ ట్రీట్
టాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు పొందిన సంయుక్తా, ఇప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
By: Tupaki Desk | 6 July 2025 11:30 PM ISTటాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు పొందిన సంయుక్తా, ఇప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ చీర లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లష్ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ చీరలో మెరిసిపోతూ, ట్రెడిషనల్ జ్వెలరీ, గజ్రాతో ఆమె లుక్‌కు ఫ్యాషన్ ప్రపంచం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతోంది.
ఈ ఫోటోషూట్‌లో ఆమె ధరించిన చీర, బ్లౌజ్ డిజైన్, మేకప్ నుంచి హెయిర్ స్టైలింగ్ వరకు ప్రతీదీ మినిమలిస్టిక్‌గా ఉండేలా స్టైలింగ్ టీమ్ ప్లాన్ చేసింది. నాజూకు హావభావాలతో రిఫైన్‌డ్ మేకప్, మాయ చూపే చూపులతో సంయుక్తా ఎక్స్‌ప్రెషన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసింది. సాధారణ చీరను కూడా ఓ కళాఖండంగా మార్చగలిగే టాలెంట్ ఆమె సొంతమని ఈ ఫోటోలు మరోసారి నిరూపించాయి.
అంతేకాదు, సంయుక్తా కెరీర్ పరంగా కూడా ఇప్పుడు సూపర్ పేస్‌లో ఉంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ స్వయంభులో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఇందులో ఆమె పాత్రలో గ్లామర్‌తో పాటు బలమైన ఎమోషన్ కూడా ఉంటుందని టాక్. ఈ సినిమాతో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్, హీరో రామ్‌తో కూడా ఓ భారీ సినిమాలో నటిస్తోంది.
పలు భాషల్లో తన క్రేజ్ పెంచుకుంటున్న సంయుక్తా, ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూ.. మరోవైపు నటనకు అవకాశమిచ్చే కంటెంట్ డ్రివన్ పాత్రలను కూడా ఎంచుకుంటోంది. ఇటీవలి కాలంలో శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కూడా ఆమె పేరు తెరపై వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె యాక్టివిటీ చూస్తే, ప్రతి లుక్‌తో ఫ్యాషన్ లవర్స్‌కి ప్రేరణనిచ్చేలా ఉంటోంది. ఈ ఫోటోషూట్‌తో మరోసారి ఆమె అందం, అభిరుచి, ఆత్మవిశ్వాసం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది.