Begin typing your search above and press return to search.

లక్కీ బ్యూటీ అన్నారు.. ఆఫర్లు అంతగా ఇవ్వరేంటి..?

మలయాళంలో హీరోయిన్ గా రాణిస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 2:45 AM GMT
లక్కీ బ్యూటీ అన్నారు.. ఆఫర్లు అంతగా ఇవ్వరేంటి..?
X

మలయాళంలో హీరోయిన్ గా రాణిస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చింది. పవన్ సినిమా ఛాన్స్ వస్తే కెరీర్ సెట్ అయినట్టే. అయితే భీమ్లా నాయక్ లో సం యుక్త రానాకి జోడీగా నటించింది. అయినా కూడా అదొక డిఫరెంట్ సినిమా కాబట్టి చేసిన ఆ కొద్ది పాత్రలో అయినా సంయుక్త ఆడియన్స్ ని అలరించింది. ఆ క్రేజ్ తో బింబిసార ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో టాలీవుడ్ లక్కీ లేడీ హీరోయిన్ అనిపించుకుంది.


ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సార్ సినిమా అమ్మడికి హ్యాట్రిక్ హిట్ అందించింది. మామూలుగా ఒక హిట్ పడితేనే ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి. సం యుక్త ఏమంగా 3 హిట్లు అందుకుంది. ఆ తర్వాత సాయి ధరం తేజ్ తో చేసిన విరూపాక్ష కూడా సక్సెస్ అయ్యింది. ఇలా తను చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవ్వడం తో సంయుక్త టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిచింది.

ఆ క్రేజ్ తో వరుస అవకాశాలు అందుకుంటుందని అనుకుంటే అది కాస్త రివర్స్ అయ్యింది. రీసెంట్ గా డెవిల్ లో నటించిన అమ్మడు ఆ సినిమా అంతగా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో కెరీర్ లో డీలా పడింది. నాలుగు వరుస హిట్లు పడినా అవి లెక్క చేయలేదు కానీ ఒక్క సినిమా ఫలితం తేడా కొట్టేయడంతో అమ్మడిని పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం సం యుక్త చేతిలో నిఖిల్ స్వయంభు మాత్రమే ఉంది.

నిఖిల్ సినిమాల్లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా అది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో సంయుక్త పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. సం యుక్త మాత్రం తెలుగులో వచ్చీ రాగానే హిట్లు సూపర్ హిట్లు పడ్డాయి లక్కీ హీరోయిన్ అన్నారు తీరా ఇప్పుడు మాత్రం అవకాశాలు ఇవ్వట్లేదని దిగులు చెందుతుంది. టాలెంట్ ఉన్నా కూడా సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే కాస్త కూస్తో లక్ కూడా ఫేవర్ చేయాలి సినిమా సక్సెస్ విషయంలో సంయుక్తకి కలిసి వచ్చిన కాలం అమ్మడికి ఆఫర్లు తీసుకు రావడంలో మాత్రం కలిసి రావట్లేదు. సంయుక్త మీనన్ స్వయంభు తో పాటు స్టార్ ఛాన్స్ లు కూడా అందుకుంటుందా ఆమె కెరీర్ ఇలానే మందకొడిగా నడుస్తుందా అన్నది చూడాలి.