Begin typing your search above and press return to search.

గోల్డెన్‌ లెగ్‌ అంటే ఇలా చేస్తుందేంటి..!

భీమ్లా నాయక్‌, బింబిసార, సార్‌, విరూపాక్ష ఇలా తెలుగు లో చేసిన సినిమాలన్నీ కూడా సంయుక్త మీనన్‌ కి మంచి విజయాలను తెచ్చి పెట్టాయి.

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:05 AM GMT
గోల్డెన్‌ లెగ్‌ అంటే ఇలా చేస్తుందేంటి..!
X

భీమ్లా నాయక్‌, బింబిసార, సార్‌, విరూపాక్ష ఇలా తెలుగు లో చేసిన సినిమాలన్నీ కూడా సంయుక్త మీనన్‌ కి మంచి విజయాలను తెచ్చి పెట్టాయి. దాంతో సంయుక్త మీనన్‌ ను మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా గోల్డెన్‌ లెగ్‌ బ్యూటీ అంటూ ఆకాశానికి ఎత్తిన విషయం తెల్సిందే.

గోల్డెన్‌ లెగ్‌ అంటూ పేరు దక్కించుకోవడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు లభించాయి. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు లోనే కాకుండా ఇతర సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించేందుకు ఓకే చెప్పడం లేదు. తాజాగా ఈమె నటించిన నందమూరి కళ్యాణ్ రామ్‌ 'డెవిల్‌' సినిమా కూడా విడుదల అయ్యి పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకుంది.

డెవిల్‌ విజయంతో మరోసారి సంయుక్త మీనన్‌ కి ఆఫర్లు వరుసగా వస్తున్నాయట. అయినా కూడా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సంయుక్తం మీనన్‌ పెళ్లి పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే సంయుక్త ప్రేమలో పడింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లికి సిద్ధం అవుతుందని, అందుకే సినిమాలకు కమిట్ అవ్వడం లేదు అనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే కమిట్‌ అయ్యి ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ 2024 లో పెళ్లి పీటలు ఎక్కాలని సంయుక్త ఆశ పడుతున్నట్లు సమాచారం అందుతోంది.

సాధారణంగా హీరోయిన్స్‌ కి గోల్డెన్‌ లెగ్‌ అంటూ పేరు రావడం జరగదు. అలాంటిది ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లతో ఆ గౌరవం మరియు గుర్తింపు దక్కినా కూడా ఎందుకు పెళ్లి అంటూ కెరీర్‌ ను నాశనం చేసుకుంటుంది అంటూ కొందరు సంయుక్తం విషయంలో పెదవి విరుస్తున్నారు. సినిమాలు కమిట్‌ అవ్వక పోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది సంయుక్త నోరు విప్పి చెప్పేనా చూడాలి.