Begin typing your search above and press return to search.

విజ‌య్-స‌మంత పూల్ పార్టీ.. ఇది ఊహా? నిజ‌మా?

ప్ర‌స్తుతం ఈ జంట విదేశీ వెకేష‌న్ లో ఉన్నార‌ని, అది కూడా ఒకే చోట క‌లిసే ఉన్నార‌ని ఊహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 12:30 PM GMT
విజ‌య్-స‌మంత పూల్ పార్టీ.. ఇది ఊహా? నిజ‌మా?
X

కొన్ని ఊహాగానాలు చేయ‌డానికి కొన్ని కార‌ణాలు ఉంటాయి. ఇంత‌కుముందే స‌మంత ఒక స్విమ్మింగ్ పూల్ లో రిలాక్స్ అవుతున్న ఫోటోల‌ను షేర్ చేసింది. అదే సమ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం ఒక వీడియోను షేర్ చేసాడు. అందులో అత‌డు కూడా స్విమ్మింగ్ పూల్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఈ ఫోటోలు వీడియోలు అందుబాటులోకి రాగానే నెటిజ‌నులు ర‌క‌ర‌కాలుగా ఊహిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ జంట విదేశీ వెకేష‌న్ లో ఉన్నార‌ని, అది కూడా ఒకే చోట క‌లిసే ఉన్నార‌ని ఊహిస్తున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాల్లో ఎవరికి తోచిన విధంగా వారు క‌థ‌నాలు అల్లుతున్నారు. విజయ్‌తో సమంత హాలిడేలో ఉంద‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇది నిజ‌మా? ఊహ మాత్ర‌మేనా? కాస్త తార్కికంగా ప‌రిశోధిస్తే మ‌న‌కు తెలిసిన సంగ‌తులివి.

నిజానికి స‌మంత ప్ర‌స్తుతం అమెరికాలో మ‌యోసైటిస్ కి చికిత్స తీసుకుంటోంది. అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శ‌తధా ప్ర‌య‌త్నిస్తోంది. అదే స‌మ‌యంలో విజ‌య్ టాలీవుడ్ మీడియాకు అందుబాటులో ఉన్నాడు. అత‌డు త‌న తాజా చిత్రం ఖుషి ప్ర‌మోష‌న్స్ చేసాడు. అత‌డు అమెరికా వెళ్లార‌ని అన‌డానికి ఎలాంటి ఆధారాల్లేవు. కానీ ఆ ఇద్ద‌రూ వేర్వేరు చోట్ల పూల్ సైడ్ రిలాక్స్ అయ్యారా? అంటే దానికి కూడా ఆధారాల్లేవ్. అలాగ‌ని ఇద్ద‌రూ క‌లిసే ఉన్నార‌ని ఎలా చెప్ప‌గ‌లం? అందుకే ఇవ‌న్నీ నిరాధార ఆరోప‌ణ‌లుగా భావించాలి.

స‌మంత‌- దేవ‌ర‌కొండ జంటగా న‌టించిన ఖుషి పాజిటివ్ స‌మీక్ష‌ల‌ను అందుకుంది. శివ‌నిర్వాణ అద్భుత‌మైన టేకింగ్ ఆక‌ట్టుకుంద‌ని ప్ర‌శంస‌లు కురిసాయి. లైగ‌ర్ ఫ్లాప్ తో నిరాశ‌పడిన విజ‌య్ కి ఇది పెద్ద ఊర‌ట అని అభిమానులు చెబుతున్నారు. ఈ విజ‌యాన్ని స‌మంత కూడా ఆస్వాధిస్తోంద‌న‌డంలో సందేహం లేదు.