అవకాశాలు వచ్చినా వదులుకుంటున్నాడా?
కోలీవుడ్ నటుడు సముద్రఖని టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. వైవిథ్యమైన పాత్రలు..నటనతో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 15 July 2025 9:00 PM ISTకోలీవుడ్ నటుడు సముద్రఖని టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. వైవిథ్యమైన పాత్రలు..నటనతో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. సహాయ పాత్రలైనా? ప్రతి నాయకుడి పాత్రై నా ఎలాంటి పాత్రకైనా వన్నే తేగల నటుడు. కేవలం నటుడు మాత్రమే కాదు. దర్శకుడు కూడా. క్రియేటివ్ రంగంలోనూ తనదైన ముద్ర వేసాడు. కానీ దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. సౌత్ లో తెలుగు, తమిళ సినిమాలే కాకుండా మలయాళ, కన్నడ చిత్రాలు కూడా చేసాడు.
కొంత కాలంగా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలని సాయితేజ్ -పవన్ కళ్యాణ్ తో `బ్రో `సినిమా కూడా తెరకెక్కించారు. ఇది యావరేజ్ గా ఆడింది. అయితే ఈ మధ్య కాలంలో సమద్ర ఖని తెలుగు తెరపై పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఎక్కడ బిజీగా ఉన్నాడని ఆరాతీయగా తెలుగు మినహా మిగతా భాషల్లో కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి టాలీవుడ్ కి ఎందుకు దూరమవుతున్నట్లు? అంటే ఇక్కడ సముద్ర ఖని ప్లానింగ్ వేరే ఉందని తెలుస్తోంది.
ఇకపై తెలుగులో నటుడిగా కంటే డైరెక్టర్ గానే ఎక్కువ సినిమాలు చేయాలనే వ్యూహంతో కదులుతున్నాడుట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాకు ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. 'బ్రో 'మేకింగ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని ప్రామిస్ చేసాడు. ఈ నేపథ్యంలో పవన్ కోసం మంచి స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారుట. అలాగే మరికొంత మంది స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకుని సముద్రఖని స్టోరీలు రెడీ చేస్తున్నట్లు తెలిసింది.
పవన్ తో సినిమా అంటే ఇప్పటికిప్పుడు అవ్వకపోయినా? ఏదో రోజు సాధ్యమవుతుంది. ప్రస్తుతం పవన్ చేతుల్లో ఉంది 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒక్కటే. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు? అన్నది క్లారిటీ లేదు. అది సముద్రఖని సినిమా అయ్యే అవకాశం లేకపోలేదు. ఎలాగూ కర్చీప్ వేసాడు కాబట్టి పవన్ పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
