Begin typing your search above and press return to search.

1950లోకి వెళుతున్న సముద్రఖని

ఇప్పుడు ప్రముఖ నటుడు సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

By:  Tupaki Desk   |   26 April 2025 5:36 AM
1950లోకి వెళుతున్న సముద్రఖని
X

దుల్కర్ సల్మాన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ 'కాంతా' పట్ల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. స్పిరిట్ మీడియా, వే ఫేర్ ఫిలిమ్స్ బ్యానర్లపై, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే దుల్కర్ లుక్, కథ నేపథ్యంతో సినిమాపై బజ్ పెరిగింది.


ఇప్పుడు ప్రముఖ నటుడు సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో విడుదలైన ఈ పోస్టర్‌లో సముద్రఖని సీరియస్ లుక్‌తో ఆకట్టుకున్నారు. కళ్ళజోడు, ఫార్మల్ షర్ట్, టక్ చేసిన స్టైల్ చూస్తే 1950ల కాలం బ్యాక్‌డ్రాప్‌గా ఉండే ఈ సినిమా కథలో ఆయన పాత్ర పవర్ఫుల్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ 1950ల మద్రాసు నేపథ్యంలో సాగనుంది. అప్పట్లో సంప్రదాయాలు, ఆధునికత తారసపడిన కాలానికి సంబంధించిన విభిన్న భావోద్వేగాలను ఈ కథలో చూపించబోతున్నారు. కథలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండగా, సముద్రఖని పాత్ర మాత్రం ఓ కీలక మలుపుగా ఉండబోతుందనే టాక్ ఉంది.

కాంతా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ కాలంకు తగ్గట్టుగా విజువల్స్, ఆర్ట్ డిజైన్‌ను భారీగా రూపొందిస్తున్నారని సమాచారం. దుల్కర్ కెరీర్‌లో కొత్త అధ్యాయంగా నిలవబోతున్న ఈ సినిమా అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.

ఈ సినిమాను టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో రూపొందించారు. ఫేమస్ డీవోపీ దాని సాంచెజ్ లోపెజ్ విజువల్స్ అందిస్తుండగా, జాను చాంతర్ సంగీతం అందిస్తున్నారు. థా.రామలింగం ఆర్ట్ డైరెక్షన్ కూడా కథకు తగినంత బలాన్నిస్తుంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పోట్లూరి, జామ్ వర్గీస్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 1950ల కాలాన్ని హైలెట్ చేదెలా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.