Begin typing your search above and press return to search.

సమంత 'సిటాడెల్‌' ఇంకా ఏంటి సమస్య ?

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌ ధావన్‌ మరో ముఖ్య పాత్రలో నటించిన సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Dec 2023 4:20 AM GMT
సమంత సిటాడెల్‌ ఇంకా ఏంటి సమస్య ?
X

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌ ధావన్‌ మరో ముఖ్య పాత్రలో నటించిన సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత బ్రేక్ తీసుకోవడానికి ముందే అంటే చాలా నెలల క్రితమే సిటాడెల్‌ షూటింగ్‌ పూర్తి అయ్యింది అంటూ ప్రచారం జరిగింది. ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో సిటాడెల్‌ సిరీస్‌ ఒక ఎపిసోడ్‌ స్క్రీనింగ్‌ కూడా చేశారు.

సిటాడెల్‌ స్ట్రీమింగ్‌ కి అమెజాన్‌ ప్రైమ్‌ మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ తాజాగా బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సిటాడెల్‌ కి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదట. కొంత ప్యాచ్ వర్క్ ఉండటంతో పాటు, కొన్ని ఎపిసోడ్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను రీ షూట్‌ చేసే ఉద్దేశ్యంతో ఉన్నారట.

దర్శక ద్వయం రాజ్ అండ్‌ డీకే లు ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారట. సమంత మరియు వరుణ్‌ ల కాంబోలో కూడా కొన్ని సన్నివేశాల రీ షూట్‌ కి ఏర్పాట్లు చేస్తున్నారు. వారిద్దరి డేట్లు కుదిరిన సమయంలో షూటింగ్ ఉంటుందని సమాచారం అందుతోంది. మొత్తానికి సిటాడెల్‌ అదుగో.. ఇదుగో అంటూ వెయిట్‌ చేస్తున్న వారికి మేకర్స్ షాక్ ఇచ్చినంత పని చేశారు.

ఈ వర్క్‌ అంతా పూర్తి అయ్యి.. ప్రమోషన్‌ చేసి స్ట్రీమింగ్‌ చేయాలంటే కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందట. అంటే సమంత, వరుణ్‌ ల సిటాడెల్‌ సిరీస్‌ ను 2024 సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు అమెజాన్ తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో వచ్చిన సిటాడెల్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. కనుక ఈ సిటాడెల్‌ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.