Begin typing your search above and press return to search.

భూకంపం పుట్టించిన స‌మంత‌

ఇక ఈ డిజైన‌ర్ డెనిమ్ లుక్ ఇంప్రెస్సివ్ అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. ముఖ్యంగా సమంత కిల్ల‌ర్ ఫోజులు కుర్ర‌కారు గుండెల్లో గుబులు పెంచుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2023 3:26 AM GMT
భూకంపం పుట్టించిన స‌మంత‌
X

త‌న‌దైన అందం న‌ట‌న‌తో పాన్ ఇండియా స్థాయిలో ఆక‌ర్షిస్తోంది స‌మంత రూత్ ప్ర‌భు. బాలీవుడ్ టాలీవుడ్ సహా అన్నిచోట్లా భారీ క్రేజ్ ఉన్న స్టార్ గా వెలిగిపోతోంది. ప్రియాంక చోప్రా న‌టించిన సిటాడెల్ ఇండియా వెర్ష‌న్ లో న‌టించిన ఘ‌న‌త స‌మంత‌కే సొంత‌మైంది. త‌దుప‌రి బాలీవుడ్ లో బిగ్ కెరీర్ ఆశిస్తున్న స‌మంత ఫోటోషూట్ల ప‌రంగా అగ్గి రాజేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌మంత ఎర్త్ బ్రేకింగ్ ఫోటోషూట్ వెబ్ లో అగ్గి రాజేస్తోంది. ప్ర‌ఖ్యాత ఎంటీవీ హ‌జిల్ కోసం ఫోటోషూట్ ఇద‌ని స‌మంత స్వ‌యంగా వెల్ల‌డించింది ఇన్ స్టాలో. ఇక ఈ డిజైన‌ర్ డెనిమ్ లుక్ ఇంప్రెస్సివ్ అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. ముఖ్యంగా సమంత కిల్ల‌ర్ ఫోజులు కుర్ర‌కారు గుండెల్లో గుబులు పెంచుతున్నాయి. డెనిమ్ టాప్ డెనిమ్ ఫ్యాంట్ లో క‌నిపించిన స‌మంత‌.. త‌న ఫ్యాంట్ కి దాదాపు రెండు డ‌జ‌న్ల పిన్నీసులు ధ‌రించ‌డం క‌నిపించింది. ఇది నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగించే డిజైన‌ర్ లుక్. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


స‌మంత‌ సోషల్ మీడియా ప్ర‌చారంలో మాత్రమే కాకుండా త‌న‌ దుస్తుల బ్రాండ్ సాకి తో పాటు ఏకమ్ ప్రీ-స్కూల్ బిజినెస్ వంటి వ్యాపారాలలోను బిజీగా ఉంది. 'ఆహా'లో సామ్ జామ్ వంటి షోలు చేస్తూ కొన్ని ఇంటర్వ్యూలను చేస్తోంది. ఇప్పుడు సామ్ కొత్త జాబ్ చ‌ర్చ‌గా మారింది. ఒక పాపుల‌ర్ రియాలిటీ షోకు స‌మంత న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. రియాలిటీ షో MTV హజిల్ త‌దుప‌రి ఎపిసోడ్‌లో సమంత కనిపించనుంది. కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా ఉన్న పాప్ స్టార్ బాద్‌షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత ఫోటోల‌ను షేర్ చేశారు. ఈ జోడీ వేదికపై నవ్వుతూ నృత్యం చేస్తూ కనిపిస్తారు.


ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత బాలీవుడ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఉత్త‌రాది వారికి సుప‌రిచితం గ‌నుక త‌ను హిందీ ప‌రిశ్ర‌మ‌లో బుల్లితెర జ‌డ్జిగా క‌నిపిస్తే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. స‌మంత ప్రస్తుతం మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి చికిత్స కొన‌సాగుతోంది. సమంతా న‌టించిన‌ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ విడుద‌ల కావాల్సి ఉంది.