Begin typing your search above and press return to search.

నిర్మాతలు వద్దన్నా అడ్వాన్స్ లు రిటర్న్ చేసిన సమంత

నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లు పెద్ద మొత్తం లో ఉండటంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2023 3:59 AM GMT
నిర్మాతలు వద్దన్నా అడ్వాన్స్ లు రిటర్న్ చేసిన సమంత
X

సమంత ఖుషి.. సిటాడెల్ షూటింగ్స్ ముగిసిన వెంటనే సినిమాల కు... సిరీస్ లకు పూర్తిగా బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అన్నట్లుగానే కొత్త ప్రాజెక్ట్‌ లను సమంత మొదలు పెట్టడం లేదు. అంతే కాకుండా ప్రస్తుతం విడుదల కు సిద్ధం అవుతున్న ప్రాజెక్ట్‌ ల ప్రమోషన్‌ కార్యక్రమాల కు అయినా సమంత మీడియా ముందుకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే సమంత కమిట్ అయిన మూడు నాలుగు సినిమాల ను క్యాన్సల్‌ చేసుకుందట. ఆ నిర్మాతల నుండి తీసుకున్న అడ్వాన్స్‌ ను కూడా సమంత తిరిగి ఇచ్చేసిందట. ఏడాది తర్వాత ఎలాగూ బ్రేక్ నుండి తిరిగి వస్తారు కదా.. అప్పుడే తమ సినిమాల్లో నటించాల్సిందిగా నిర్మాతలు కోరినా కూడా సమంత మాత్రం అడ్వాన్స్ లు తన వద్ద ఉంచుకోవాలనుకోవడం లేదని చెప్పేసిందట.

నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లు పెద్ద మొత్తం లో ఉండటంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఉన్న కమిట్మెంట్స్ ను కూడా సమంత వదిలేసుకుంది. బ్రేక్ తర్వాత ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉంటే వెంటనే చేస్తుందని అనుకున్న వారికి ఈ విషయం షాకింగ్ గా ఉంది అంటున్నారు.

సమంత ఏడాది తర్వాతైనా సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అడ్వాన్స్ లు ఏళ్లకు ఏళ్లు పెట్టుకుని సినిమాలు చేసే హీరోలు హీరోయిన్స్ ఉంటారు. కానీ సమంత మాత్రం ఒక్క ఏడాదికే అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని అనుకోవడానికి కారణం ఏంటో అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

మయో సైటిస్‌ అనే అనారోగ్య సమస్య తో ఒకానొక సమయం లో సమంత కనీసం నిల్చోవడానికి కూడా ఇబ్బంది అయింది. ఆ సమస్య నుంచి మెల్ల మెల్లగా కోలుకుని ఖుషి.. సిటాడెల్ షూటింగ్స్ ను ముగించింది. షూటింగ్ లో అయితే పాల్గొంది కానీ మయో సైటిస్ సమస్య ఆమెను బాధిస్తూనే ఉందట. అందుకే ఏడాది పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని చికిత్స తీసుకోవాల ని సమంత భావిస్తుందని.. అందుకే బ్రేక్ తీసుకుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది లో సమంత మళ్లీ సినిమా లు చేస్తుందా లేదా అనేది చూడాలి.