Begin typing your search above and press return to search.

మళ్లీ పెళ్లి ఆలోచన ఉందా? సమంత ఆన్సర్ అంచనాలకు అందదంతే!

ఏమైనా అడిగేయొచ్చని చెప్పేసింది. అంచనాలకు తగ్గట్లే.. మళ్లీ మీరు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అంటూ ఒక అభిమాని ఒద్దికగా ప్రశ్నించాడు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:25 AM GMT
మళ్లీ పెళ్లి ఆలోచన ఉందా? సమంత ఆన్సర్ అంచనాలకు అందదంతే!
X

మళ్లీ వార్తల్లోకి వచ్చారు సమంత అలియాస్ సామ్. ఆమె వ్యక్తిగత విషయానికి సంబంధించి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సలు అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ఆమె ఆన్సర్ ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ ఆదివారం ఇన్ స్టాలో అభిమానులకు అందుబాటులోకి వచ్చేసింది సమంత. ఏమైనా అడిగేయొచ్చని చెప్పేసింది. అంచనాలకు తగ్గట్లే.. మళ్లీ మీరు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అంటూ ఒక అభిమాని ఒద్దికగా ప్రశ్నించాడు.

దీనికి అనూహ్యమైన రీతిలోసమాధానం ఇచ్చారు సమంత. ఇంతకూ ఆమె సమాధానం ఏమిటో తెలుసా? 2023లో విడుదల చేసిన విడాకుల లెక్కలకు సంబంధించిన రిపోర్టు కాపీ. దాని స్క్రీన్ షాట్ తీసి తన స్పందనగా షేర్ చేయటమే కాదు.. దానికి ఒక స్మైలీ ఎమోజీని యాడ్ చేశారు. అక్కడితో ఆగని ఆమె.. "తాజా లెక్కల ప్రకారం బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ అవుతుంది" అంటూ బిజినెస్ లెక్కలకు తగ్గట్లుగా ఆన్సర్ ఇచ్చాచు.

స్క్రీన్ షాట్.. దానికి ఇచ్చిన క్యాప్షన్ చూస్తే.. తాను మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం అస్సలే లేదన్నది ఆమె సమాధానంగా చెప్పాలి. అయితే.. పెళ్లిని వ్యాపార ధోరణిలో చూడటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇంతకూ ఆమె షేర్ చేసిన స్క్రీన్ షాట్ లోని లెక్కల్ని చూస్తే.. మొదటిసారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటున్నవారి రేటు యాభైశాతం ఉంటే.. రెండోసారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటున్న వారి రేటు 67 శాతం ఉన్నట్లు అందులో ఉంది.

అంతేకాదు.. మూడోసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకుల రేటు 73 శాతంగా ఉంది. ఈ లెక్కలన్నిఆడ.. మగ అన్న తేడా లేకుండా అందరికి అన్వయించేలా లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల్ని చూస్తే.. పెళ్లిళ్లు ఎన్నిసార్లు చేసుకుంటే.. అంతకు మించి విడాకుల ముప్పు పొంచి ఉందన్నట్లుగా ఆమె షేర్ చేసిన గణాంకాలు ఉన్నాయి. ఇంతదానికి పెళ్లి ఎందుకు బాబు అన్నట్లుగా ఆమె మాటగా చెప్పాలి. సో.. సామ్ ను ఇకపై ఏ ప్రశ్న అయినా అడుగుతారేమో కానీ.. మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని మాత్రం అడగరని చెప్పక తప్పదు.