పవర్ స్టార్ కి ఎవరికి ఏమివ్వాలో తెలుసు..!
ఇక పవర్ స్టార్ తో తను సినిమా చేయాలనుకున్న కోరిక అలానే ఉందని కానీ ఇప్పుడు ఆయన చాలా పెద్ద స్థాయికి చేరుకున్నారని అన్నారు.
By: Tupaki Desk | 16 April 2025 8:30 PMమాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఈమధ్య డైరెక్టర్ గా సినిమాలు కాస్త తగ్గించి ప్రొడక్షన్ మీద ఎక్కువ పనిచేస్తున్నాడు. ఓదెల 1 సినిమాను నిర్మించిన సంపత్ నంది ఆ సినిమా సీక్వెల్ గా ఓదెల 2 సినిమాను కూడా తీశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన సంపత్ నంది సహ నిర్మాతగా కూడా ఉన్నారు. తమన్నా లీడ్ రోల్ లో నటించిన ఓదెల 2 సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో సంపత్ నంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా మిస్ అవ్వడం గురించి చెప్పుకొచ్చారు. మెగా అభిమాని అయిన సంపత్ నంది పవర్ స్టార్ కి మంచి అభిమాని. ఐతే ఆయనతో సినిమా చేయాలనే ఉద్దేశంతో బెంగాల్ టైగర్ కథను పవన్ కళ్యాణ్ కి వినిపించారట. ఐతే ఆ టైం లో ఆ కథను పక్కన పెట్టి మరో కథ మీద పవన్ కళ్యాణ్ వర్క్ చేయమన్నారట.
అలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర దాకా వర్క్ చేశానని ఐతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చారు సంపత్ నంది. ఐతే పవర్ స్టార్ కి ఎవరికి ఏమివ్వాలో తెలుసు. ఆయనకు ఎవరు ఏమి చెప్పకర్లేదని అన్నారు సంపత్ నంది. తాను చేసిన ఆ వర్క్ కి తనకు తగిన పారితోషికం ఇప్పించారని అన్నారు సంపత్ నంది. ఆయనకు మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు అన్నీ తెలుసు అంటూ సంపత్ నంది చెప్పడం విశేషం.
ఇక పవర్ స్టార్ తో తను సినిమా చేయాలనుకున్న కోరిక అలానే ఉందని కానీ ఇప్పుడు ఆయన చాలా పెద్ద స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఎప్పటికైనా తన ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటానని అన్నారు సంపత్ నంది. టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఎందుకో ఆ తర్వాత అ స్టాండర్డ్ ని మెయింటైన్ చేయలేకపోయాడు. డైరెక్టర్ గా చేస్తున్న సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడంతో కెరీర్ గ్యాప్ ఇచ్చిన సంపత్ నంది నిర్మాతగా మారి డిఫరెంట్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.
సంపత్ నంది ఓదెల 2 తర్వాత మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. యువ హీరో శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమా 1965 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సంపత్ నంది సూపర్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.