Begin typing your search above and press return to search.

హతవిధి.. పాట కూడా కాటేసింది..?

యువ హీరో కిరణ్ అబ్బవరం కి బ్యాడ్ టైం నడుస్తుంది. లాస్ట్ ఇయర్ వినరో భాగ్యము విష్ణు కథ హిట్ అవగా ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Oct 2023 10:30 AM GMT
హతవిధి.. పాట కూడా కాటేసింది..?
X

యువ హీరో కిరణ్ అబ్బవరం కి బ్యాడ్ టైం నడుస్తుంది. లాస్ట్ ఇయర్ వినరో భాగ్యము విష్ణు కథ హిట్ అవగా ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న కిరణ్ అబ్బవరం కి ఈ సినిమా కూడా షాక్ ఇచ్చింది. రత్నం కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. రొటీన్ కథ పరమ రొటీన్ కథనంతో రూల్స్ రంజన్ ఆడియన్స్ పేషెన్సీ ని టెస్ట్ చేస్తుంది.

ప్రచార చిత్రాలు సినిమాపై బజ్ పెంచగా సినిమాలోని సమ్మోహనుడా సాంగ్ హిట్ అయ్యింది. రిలీజ్ ముందు సినిమాలోని ఒక సాంగ్ రీల్స్ లో వైరల్ అయితే ఆ సినిమా ఉన్న సినిమాకు ఆ సాంగ్ వల్ల కొంత మైలేజ్ వస్తుంది. కానీ సమ్మోహనుడా సాంగ్ కూడా రూల్స్ రంజన్ ని కాపాడలేకపోయింది. సినిమాలోని ఆ సాంగ్ లో నేహా శెట్టి గ్లామర్ షో అదిరిపోయింది. అయితే సినిమా అంతా పరమ రొటీన్ గా నడుస్తున్న టైం లో కనీసం ఈ సాంగ్ అయినా రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అనుకుంటే అది కూడా నీరసం తెప్పించింది.

వీడియో సాంగ్ లో ఉన్నవే థియేటర్ లో ఉండటం వల్ల ఏదైతే సూపర్ హిట్ అనిపించిన సాంగ్ కాస్త తుస్సుమన్నది. ఇలా రూల్స్ రంజన్ విషయంలో చాలా మిస్ ఫైర్ అయ్యాయి. కంప్లీట్ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన రూల్స్ రంజన్ సినిమా ఆడియన్స్ ని బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేయించింది తప్ప కథ కథనాలు వాటికి తగిన ఎంటర్టైనింగ్ అందించలేకపోయింది.

కాపాడుతుంది అనుకున్న సాంగ్ కూడా కాటేయడంతో కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ అతని కెరీర్ లో మరో డిజాస్టర్ మూవీగా నిలిచింది. కథల విషయంలో కిరణ్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న కిరణ్ ఆలోచన మంచిదే కానీ కథలో కొత్తదనం గురించి ఆలోచించకుండా రొటీన్ కథలకు ఓకే చెప్పడం మాత్రం అతని కెరీర్ గ్రాఫ్ కిందకి వచ్చేలా చేస్తుంది. రాబోయే సినిమాలతో తానేంటో చూపిస్తా అని తన ఫ్యాన్స్ కి మాటిచ్చిన కిరణ్ అబ్బవరం ఆ మాట నిలబెట్టుకునే సినిమాలు చేస్తే బెటర్.