Begin typing your search above and press return to search.

సామ్.. న్యూ ఇయర్ లో హీటెక్కించే లుక్

కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ తనదైన ముద్ర వేసుకుంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 2:50 PM IST
సామ్.. న్యూ ఇయర్ లో హీటెక్కించే లుక్
X

సమంత.. ఈ స్టార్ హీరోయిన్ తన నటనతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకుంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా అలరిస్తోంది.


సినీ రంగంలోకి ప్రవేశించి చాలా కాలమైనా అగ్రకథానాయికగా కొనసాగుతుందంటే అందుకు కారణం నటన పట్ల అంకితభావంతో పాటు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే. అయితే కఠినమైన వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌నెస్‌ను నిరంతరం కాపాడుకోవాలి. ఈ విషయంలో సమంత ముందుచూపుతో వ్యవహరిస్తోంది. వివిధ రకాల ఫిట్‌నెస్ యాక్టివిటీస్ చేస్తూనే హెల్త్ డ్రింక్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.

అయితే సమంత తన హెల్త్ పై ఫోకస్ పెట్టడంతో ఏడాదిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో డైలీ సందడి చేస్తోంది. తన పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది.

సముద్రపు ఒడ్డున సామ్ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ సూపర్ స్టిల్ ఇచ్చింది. ఆ ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు కూడా న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. 'చాలా మంది దేవదూతలు మన చుట్టూ ఉండవచ్చు.. నూతన సంవత్సర శుభాకంక్షలు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

దీంతో ఆమె అభిమానులు కూడా సమంతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఇయర్ లో సామ్ కు మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నారు. కెరీర్ లో కూడా ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. సమంత ఇచ్చిన స్టిల్ మైండ్ బ్లోయింగ్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

సెలబ్రేషన్స్ లో భాగంగా సామ్ నైట్ వేర్ లో దర్శనమిచ్చింది. డీప్ బ్యాక్ లో అందాలను ప్రదర్శిస్తూ పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. సిటాడెల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ సిటాడెల్‌ కు ప్రీక్వెల్‌గా రానుందని సమాచారం. సిటాడెల్ సిరీస్‌లో సమంతతోపాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.