Begin typing your search above and press return to search.

సామ్ ఖుషి క్లిక్.. కొంచెం కిక్కిచ్చే గ్లామర్

పింక్ కలర్ డ్రెస్ లో బెడ్ మీద పడుకొని కళ్లకు కళ్లజోడు పెట్టుకొంది. ఆ తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ క్యూట్ గా సెల్ఫీ తీసుకుంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 12:55 PM GMT
సామ్ ఖుషి క్లిక్.. కొంచెం కిక్కిచ్చే గ్లామర్
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తాను నటించిన ఖుషీ మూవీపై చాలా ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. చివరగా, ఆమె శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో ఆమె ఖుషీతో కచ్చితంగా హిట్ కొట్టాలని అనుకుంటోంది. అందుకే, ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం చాలా హుషారుగా పాల్గొంటోంది.


ఇటీవల ఈ మూవీ మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సమంత చాలా హుషారుగా పాల్గొంది. విజయ్ దేవరకొండతో కలిసి డ్యాన్సులు కూడా చేసింది. డ్యాన్స్ చేసే సమయంలో బ్లాక్ కలర్ లెహంగాలో కనిపించిన సామ్, ఆ తర్వాత రెడ్ కలర్ శారీలో ఛేంజ్ అయ్యి కనిపించింది.

ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కాగా, మామూలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత, ఈ మూవీ సందర్భంగా మరింత యాక్టివ్ అయ్యింది. క్యూట్, హాట్ ఫోజులతో ఆకట్టుకుంటోంది. నిన్నటికి నిన్న లెహంగాలో కారులో హాట్ ఫోజులతో అదరగొట్టిన సమంత, తాజాగా ఓ క్యూట్ సెల్ఫీతో మైమరిపించింది.

పింక్ కలర్ డ్రెస్ లో బెడ్ మీద పడుకొని కళ్లకు కళ్లజోడు పెట్టుకొంది. ఆ తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ క్యూట్ గా సెల్ఫీ తీసుకుంది.ఈ ఫోటో ఇప్పుడు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా, సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇది కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఖుషీ మూవీ విషయానికి వస్తే, ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. రెండు విభిన్న మతాల వారు ప్రేమించుకొని, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంది? సంతోషంగా ఉన్నారా? లేక గొడవలతో విడిపోయారా అనేదే ఈ కథ. మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.