Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ఫోటో షేరింగ్ వెనక ఇంత మ్యాటర్ ఉందా..?

కెరీర్ కొన్నాళ్లే కొనసాగించినా ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు భామలు చేస్తుంటారు

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:14 AM GMT
ఆ హీరోయిన్ ఫోటో షేరింగ్ వెనక ఇంత మ్యాటర్ ఉందా..?
X

కెరీర్ కొన్నాళ్లే కొనసాగించినా ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు భామలు చేస్తుంటారు. అలాంటి వారిలో సమీరా రెడ్డి ఒకరు. ఎన్.టి.ఆర్, చిరంజీవి లాంటి స్టార్స్ తో నటించిన సమీరా రెడ్డి తెలుగులో తీసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఆమెను ఎప్పటికీ మర్చిపోలేరు. తెలుగుతో పాటుగా అమ్మడు తమిళంలో కూడా క్రేజీ సినిమాలు చేసింది. నిన్నటితరం తారగా సమీరా రెడ్డి తన సత్తా చాటింది. ఐతే ఆఫ్టర్ మ్యారేజ్ సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన సమీరా రెడ్డి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సర్ ప్రైజ్ చేస్తుంది.

తన ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో ఫోటోల రూపంలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తుంది సమీరా రెడ్డి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి తనని కొందరు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేయించుకోమన్నారని చెప్పుకొచ్చింది. కెరీర్ లో మంచి ఫాం లో ఉన్నప్పుడు పరిశ్రమలో కొందరు తనకు అలాంటి సలహాలు ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ అలా చేయించుకున్నారు నువ్వు కూడా చేయించుకో అని చెప్పారట. ఐతే వారి మాటలను పెద్దగా పట్టించుకోకుండా సమీరా రెడ్డి కెరీర్ లాగించేశారు.

అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో కొందరు హీరోయిన్స్ తమ వయసు దాచి పెడుతూ ఉంటారు. కానీ తను అలా చేయనని అంటుంది. తనకు 40 ఏళ్లు పైన ఉన్నా ఎంతో ఉత్సాహంగా ఉంటున్నానని అన్నారు. బాగున్నప్పుడే కాదు బాగా లేనప్పుడు కూడా తను ఫోటోలు షేర్ చేస్తానని.. అలా చేయడం వల్ల తనలాంటి మరికొంతమంది మహిళలకు స్పూర్తిని ఇచ్చినట్టు అవుతుందని అన్నారు సమీరా రెడ్డి. సమీరా రెడ్డి ఫోటోల షేరింగ్ వెనక అసలు రీజన్ ఇదా అని తెలుసుకున్న చాలామంది ఆమెని సూపర్ అనేస్తున్నారు.

మనల్ని అభిమానించే వారు తాము ఎలా ఉన్నా సరే అభిమానిస్తారు. ఐతే హీరోయిన్ గా కెరీర్ కు ఎండ్ కార్డ్ వేసి ఫ్యామిలీ ఉమెన్ గా మారిన సమీరా రెడ్డి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య ఒకప్పుడు కాస్త క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ అంతా కూడా మళ్లీ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి సమీరాకు కూడా అలాంటి ఆలోచన ఏదైనా ఉందా అన్నది చూడాలి.