Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ టూర్ చాలా స్పెష‌ల్ గురూ!

త‌ల్లైన త‌ర్వాత ముస‌లి అవ్వ‌లా మారిపోయిందేంట‌ని అంతా నెట్టింట చ‌ర్చించుకున్నారు

By:  Tupaki Desk   |   10 Jun 2024 9:32 AM GMT
ఫ్యామిలీ టూర్ చాలా స్పెష‌ల్ గురూ!
X

స‌మీరా రెడ్డి సినిమాల‌కు రిటైర్మెంట్ ఇచ్చి చాలా కాల‌మ‌వుతోంది.పెళ్లైన త‌ర్వాత నో మూవీస్ అనే కండీష‌న్ పెట్టుకుని ముందుకెళ్తోంది. అలాగ‌ని అభిమానులకు దూరం కాలేదు. ఇన్ స్టా వేదిక‌గా అప్పుడ‌ప్పుడు త‌ళుక్కున మెరుస్తుంది. ఫ్యామిలీ విశేషాల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. తాజాగా స‌మీరా రెడ్డి కుటుంబ స‌మేతంగా టూర్ ని ఆస్వాదిస్తోన్న కొన్ని ఫోటోల్ని నెట్టింట పంచుకుంది.

ఈ వెకేష‌న్ లో ప్ర‌తీమూవ్ మెంట్ ని ఓ జ్ఞాప‌కంగా మ‌లుచుకుంది. భ‌ర్త‌..కుమార్తె, కుమారుడు తో క‌లిసి దిగిన కొన్ని ఫోటోలు పంచుకుంది. ఆ విశేషాల్లోకి వెళ్తే... రిసార్స్ట్ లో ఇలా చిలౌట్ అవుతున్నారు. ఒక పిక్ లో స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ..జ‌ల‌కాలాట‌లు ఆడుతూ క‌నిపిస్తున్నారు. అదే స్నాప్ లో సూర్యుడు ఉద‌యిస్తోన్న స‌న్నివేశాన్ని ఎంతో అందంగా త‌మ కెమెరాలో బంధించారు. సూర్యుడి వెనుక హ‌బ్బీ, స‌మీరా ఎంతో క్లోజ్ మూవ్ మెంట్లో చూడొచ్చు.

మ‌రో స్నాప్ లో హోట‌ల్ గ‌దిలో రిలాక్స్ అవుతోన్న స‌న్నివేశంలో ఆ జోడీ ఎంతో అందంగా క‌నిపిస్తుంది. ఇంకా స‌మీరా చేతిలో పుడ్...పూల్ మ‌ధ్య‌లో జ‌ల‌కాల‌డుతూ ఆస్వాదిస్తోన్న మూవ్ మెంట్ అది. ఇక కుమారుడు అయితే ఏకంగా కాక్ పిట్ లో కూర్చుని పైలెట్ నే డ్రైవ్ చేస్తూన్న‌ట‌న్లు ఫోజులిచ్చాడు. ఇది పూర్తిగా స‌మీరా రెడ్డి ఫ్యామిలీ ప్ర‌యివేట్ ట్రిప్ లా ఉంది. ఓన్ ప్లైట్ జ‌ర్నీని ఆస్వాదించిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఐలాండ్ అందాల్ని ఆస్వాదిస్తున్నారు. అటు నుంచి మ‌రిన్ని అంద‌మైన ప్రాంతాల్లో స‌మీరా ప్యామిలీ ల్యాండ్ అవుతుంది.

ప్ర‌స్తుతం ఈ టూర్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. స‌మీరా అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. స‌మీరా ఫ్యామిలీ వెకేష‌న్ పూర్త‌య్యేవ‌ర‌కూ అభిమానుల‌కు ఇన్ స్టాలో పండ‌గే. స‌మీరా ఫ్యామిలీతో పాటు అంద‌మైన లొకేష‌న్ల‌ను అభిమానులు ఇన్ స్టాలో ఆస్వాదించొచ్చు.