Begin typing your search above and press return to search.

ఆ ఒత్తిడి ఎప్పుడూ ఉండేది - సమీరా రెడ్డి

తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసి తన అభిప్రాయాలను పంచుకుంది.

By:  Madhu Reddy   |   27 May 2026 8:00 PM IST
ఆ ఒత్తిడి ఎప్పుడూ ఉండేది - సమీరా రెడ్డి
X

తెరపై కనిపించేది కొంత సమయమే అయినా.. తమ అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక సడన్ గా ఇండస్ట్రీ నుంచి దూరమైతే మాత్రం మళ్లీ వీరు ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారా అని అడిగే అభిమానులు కూడా లేకపోలేదు. అలా కొన్ని సినిమాలలో నటించినా.. తమ అద్భుతమైన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకున్న వారిలో సమీరా రెడ్డి కూడా ఒకరు.. తెలుగు, తమిళ్, బెంగాలీ, మలయాళం,కన్నడ, హిందీ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ నటిగా స్థిరపడింది.

తెలుగులో ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ వంటి చిత్రాలలో నటించి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సమీరారెడ్డి.. జై చిరంజీవ సినిమాలో కూడా నటించింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే తెలుగు తెరకు దూరమైన ఈమె హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఇక 2012లో కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించిన సమీరా రెడ్డి.. ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాలలో కనిపించలేదు. ఇక తమిళ్ , హిందీ అంటూ సినిమాలు చేస్తూ ఆఖరికి ఇండస్ట్రీ నుండి దూరమైంది.

ఇక తర్వాత సడన్ గా కొన్నాళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చి గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడిప్పుడే బరువును తగ్గించుకుంటూ పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె.. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసి తన అభిప్రాయాలను పంచుకుంది. ఇక అందులో భాగంగానే వైట్ క్రీమ్ కాంబినేషన్ లో పింక్ బ్లూ ఫ్లవర్స్ తో డిజైన్ చేసిన శారీ కట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్ లో స్లీవ్ లెస్ పింక్ కలర్ బ్లౌజ్ ధరించి నెటిజన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అపార్ట్మెంటులో తన ప్లాట్ నుంచి చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ఈసారి ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ "మీకు అందంగా ముస్తాబవడం ఇష్టమా?.. నిజం చెప్పాలంటే నాకు ముస్తాబవడం మీద ఆసక్తి పోయింది. కానీ దానికి కూడా ఒక కారణం ఉంది. ఇంతకుముందు నేను ఎప్పుడూ పర్ఫెక్ట్ గా కనిపించడం గురించి చాలా ఆందోళన చెందేదాన్ని. పైకి కనిపించాలనే ఒత్తిడి నాలో ఎప్పుడూ ఉండేది. కానీ ఇప్పుడు నేను నా లుక్ తో.. నా పద్ధతిలో.. నా స్టైల్ లో ఒత్తిడి లేకుండా అదరగొట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ ఒత్తిడిని వదిలేసినప్పుడే వాతావరణం మరింత నిజంగా , అందంగా మారిపోతుంది" అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది. మొత్తానికైతే తాను బరువు పెరిగిపోయిన తర్వాత అందంగా కనిపించడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. ఇప్పుడు మానసికంగా మరింత ధైర్యంగా ఉన్నాను కాబట్టే వాటన్నింటినీ వదిలేసాను అంటూ తెలిపింది సమీరారెడ్డి.

ఇక సమీరా రెడ్డి విషయానికి వస్తే.. ప్రస్తుతం సంజయ్ దత్ అమిత్ సాద్ లతో కలిసి ఆఖ్రి సవాల్ అనే చిత్రంలో నటించింది. ఇక ఇప్పుడు గగన్ పూరీ దర్శకత్వంలో వస్తున్న అతీంద్రియ థ్రిల్లర్ మూవీ చిమ్ని అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఈమె కాళీ అనే ప్రధాన పాత్ర పోషిస్తుంది.. మరి ఈ సినిమాలు సమీరా రెడ్డికి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.a