Begin typing your search above and press return to search.

హీరోయిన్ సమీరా రెడ్డి పోస్ట్.. సిగ్గు పడకుండా కామెంట్ చేయాలట!

తాజాగా పోస్ట్ లో ప్రతి ఒక్కరూ తమ శరీర భాగాలు అంగీకరించడానికి ఇబ్బంది పడతారని అన్నారు. తన శరీరంలో ఏదైనా ఇతర అసంపూర్ణత ఉంటే ఎవరైనా నిజాయితీగా గుర్తించాలని కోరారు.

By:  Tupaki Desk   |   26 May 2025 11:10 PM IST
హీరోయిన్ సమీరా రెడ్డి పోస్ట్.. సిగ్గు పడకుండా కామెంట్ చేయాలట!
X

హీరోయిన్ సమీరా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాల్లో నటించిన అమ్మడు.. అనేక హిట్స్ ను అందుకున్నారు. ఎన్టీఆర్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఓ రేంజ్ లో అలరించారని చెప్పాలి. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో వివిధ సినిమాల్లో భాగం సమీరా రెడ్డి.

2002లో బాలీవుడ్ మూవీ మెమ్మే దిల్ తుజ్కో దియా మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన సమీర.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన వారణం ఆయిర్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చారు. తెలుగులో అశోక్, జై చిరంజీవ సహా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్ధన్‌ను వివాహం చేసుకుంది అమ్మడు.

ఆ తర్వాత సినిమాలకు చాలా కాలం పాటు దూరంగా ఉన్న సమీరా.. మోహన్ లాల్ తో కలిసి ఒరుణాల్వారంలో నటించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ పిక్స్ షేర్ చేస్తున్నారు. తన ఫిట్ నెస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు సూచనలు, సలహాలు ఇస్తూ వైరల్ అవుతుంటారు సమీరా రెడ్డి.

తాజాగా పోస్ట్ లో ప్రతి ఒక్కరూ తమ శరీర భాగాలు అంగీకరించడానికి ఇబ్బంది పడతారని అన్నారు. తన శరీరంలో ఏదైనా ఇతర అసంపూర్ణత ఉంటే ఎవరైనా నిజాయితీగా గుర్తించాలని కోరారు. చాలా మంది ఉదయం లోపాలపై దృష్టి పెట్టడం, రోజు ప్రారంభం కావడానికి ముందే విమర్శించడం ఎంత సాధారణమో హైలెట్ చేశారు సమీరా రెడ్డి.

తన రెండు పిక్స్ ను షేర్ చేసిన సమీరా, తన ఫాలోవర్స్ ను ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకోవాలని కోరారు. ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవడంలో అస్సలు సిగ్గు పడొద్దని అన్నారు. "నీ శరీరంలోని ఏ భాగాన్ని అంగీకరించడానికి నువ్వు ఇబ్బంది పడ్డావు? మనమందరం అద్దంలోకి చూస్తూ ఆ ఒక్క భాగాన్ని జూమ్ చేస్తాం" అంటూ రాసుకొచ్చారు.

"చేతులు... వదులుగా ఉన్న బొడ్డు.. లావుగా ఉన్న తొడలు... సంపూర్ణమైన ముక్కు.. ఛాతీ పరిమాణం.. మొదలైనవి మనల్ని మనం విమర్శించుకోవడం దాదాపు కామన్. కానీ దానికి ప్రేమ మరియు అంగీకారం ఇస్తే" అంటూ పోస్ట్ చేశారు సమీరా రెడ్డి. సెల్ఫ్ లవ్, ఫిట్నెస్ కమ్యూనిటీ పలు హ్యాష్ ట్యాగ్స్ ను ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.