Begin typing your search above and press return to search.

జీవితంలో సమంత చేసిన అతి పెద్ద తప్పు...!

సమంత... నేను నా ఇష్టాలను, అయిష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను.

By:  Tupaki Desk   |   18 Jan 2024 9:15 AM GMT
జీవితంలో సమంత చేసిన అతి పెద్ద తప్పు...!
X

సమంత మయోసైటిస్ కారణంగా చికిత్స తీసుకోవడం కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. సినిమాలకు అయితే దూరంగా ఉంటుంది కానీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. యాడ్స్ షూట్‌ లో పాల్గొనడంతో పాటు, సోషల్ మీడియాలో ఫోటోలను షేర్‌ చేయడం, స్టేజ్ షోల్లో కనిపించడం చేస్తూనే ఉంది.

ఇక ఈమె షేర్ చేసే ఫోటోలు మరియు కొటేషన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు మరియు వీడియో లు ఎంతగా పాపులారిటీని సొంతం చేసుకున్నాయో అదే విధంగా ఈమె వ్యాఖ్యలు కూడా అందరికి ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్‌ చేసిన సమంత ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

మీ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటి అంటే మీ సమాధానం ఏంటి అంటూ సమంత ను ప్రశ్నించిన సమయంలో ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. సమంత... నేను నా ఇష్టాలను, అయిష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను. ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం అతి పెద్ద పొరపాటు గా నేను భావిస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

నాతో ఉన్న వారితో, నా జీవిత భాగస్వామి వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యి నా ఇష్టాలను, నా అయిష్టాలను గుర్తించలేకపోయాను అన్నట్లుగా సమంత పేర్కొంది. మొత్తానికి సమంత ఒకానొక సమయంలో తాను చాలా పెద్ద తప్పు చేశాను, ఆ తప్పు మళ్లీ చేయకూడదని భావిస్తున్నట్లుగా పేర్కొంది.

వ్యక్తిగత జీవితంలో ఇష్టాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వెళ్లక పోవడం అనేది జీవితంలో అతి పెద్ద తప్పుడు నిర్ణయం అవుతుందని, అదే అతి పెద్ద పొరపాటు అవుతుంది అన్నట్లుగా సమంత చేసిన వ్యాఖ్యల అర్థం అన్నట్లుగా నెటిజన్స్ డీ కోడ్‌ చేస్తున్నారు. అదే సమయంలో నాగ చైతన్య పై సమంత ఇండైరెక్ట్‌ గా కామెంట్స్ చేసిందని కూడా కొందరు అంటున్నారు.

సమంత ఖుషి సినిమా తో టాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఆమె నుంచి వెంటనే మరో కమర్షియల్‌ సినిమాను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి బ్రేక్ లో ఉన్న సమంత త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనతో వస్తుందేమో చూడాలి.