Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి 'SYG'.. అప్పుడే 75% పూర్తి..

తాజాగా చిత్రీకరణకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 120 రోజుల షూటింగ్ పూర్తి అయిందని చెప్పారు. ఓవరాల్ గా 75% షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు.

By:  Tupaki Desk   |   28 May 2025 1:32 PM
మెగా మేనల్లుడి SYG.. అప్పుడే 75% పూర్తి..
X

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సంబరాల యేటిగట్టు (SYG). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు.

సంబరాల యేటిగట్టు మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన కార్నేజ్ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ అందుకుంది. సినిమాపై ఓ రేంజ్ లో బజ్ పెంచేసింది. మూవీ నెక్ట్స్ లెవెల్‌ లో ఉండనుందని అంతా అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో సాయి దుర్గ తేజ్‌ కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ గా నిలుస్తోంది.

అయితే సంబరాల యేటిగట్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా చిత్రీకరణకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 120 రోజుల షూటింగ్ పూర్తి అయిందని చెప్పారు. ఓవరాల్ గా 75% షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు. దీంతో చిత్రీకరణ విషయంలో మేకర్స్ ఎంత డెడికేటివ్ గా ఉన్నారో క్లియర్ గా తెలుస్తోంది.

కాగా, నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ ఇప్పుడు భారీ సెట్స్ ను నిర్మిస్తున్నారు. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ లను అందులో షూట్ చేయనున్నారు. అలా తదుపరి చిత్రీకరణ షెడ్యూల్‌ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అవి సూపర్ గా ఉంటాయని, సినిమాలో అట్రాక్ష్టివ్ గా నిలుస్తాయని సమాచారం.

అయితే సంబరాల యేటిగట్టు సినిమాలో సాయి దుర్గ తేజ్‌ సరసన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ కాకుండా మిగతా క్యాస్టింగ్ గురించి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు.

అదే సమయంలో ప్రాజెక్టు కోసం టాలెంటెడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించారు, వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. బి. అజనీష్ లోక్‌ నాథ్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ విజయ కృష్ణ నేతృత్వంలో ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ నేతృత్వంలో ప్రొడక్షన్ డిజైన్ వర్క్స్ జరుగుతున్నాయి. సెప్టెంబరు 25న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.