Begin typing your search above and press return to search.

అలా వచ్చి, ఇలా వెళ్లిపోయిన సమంత..!

అనుకున్నట్లుగానే సమంత అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేసింది. వచ్చిన ఒక్క రోజు కూడా లేకుండా ఆమె వెళ్లిపోవడం విశేషం.

By:  Tupaki Desk   |   7 Sep 2023 1:43 PM GMT
అలా వచ్చి, ఇలా వెళ్లిపోయిన సమంత..!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, రౌడీ హీరో విజయ్ దేవర కొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ మూవీ విడుదలకు ముందే సమంత అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడ విడుదలకు ముందు ప్రమోషన్స్ పూర్తి చేసిన ఆమె, తర్వాత అమెరికాలో ప్రమోషన్స్ చేశారు.

అయితే, మూవీ హిట్ అయ్యిందని, నిర్మాతలు సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకున్నారు. ఈ సక్సెస్ మీట్ లో సమంత కూడా పాల్గొంటుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే సమంత అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేసింది. వచ్చిన ఒక్క రోజు కూడా లేకుండా ఆమె వెళ్లిపోవడం విశేషం.

నిజానికి విషయం ఏమిటంటే, ఖుషీ మూవీ అమెరికాలో మంచి సక్సెస్ అందుకుంది. అక్కడి వారికి విపరీతంగా నచ్చేసింది. అంతెందుకు అక్కడ కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లోనూ అదేవిధంగా ఉంటుందని సమంత భావించింది. అందుకే, చికిత్సను పక్కన పెట్టి మరీ, హైదరాబాద్ చేరుకుంది. టీమ్ తో కలిసి ఇక్కడ మరోసారి ప్రమోషన్స్, సక్సెస్ మీట్ లో పాల్గొనాలని అనుకుందట. కానీ, ఇక్కడ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

దానికి తోడు వర్షాలు కూడా మూవీ కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించాయి. దీంతో, సమంత వెంటనే వచ్చిన దారే మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. ఇక, పూర్తిగా చికిత్స అయిపోయిన తర్వాతే మళ్లీ ఆమె హైదరాబాద్ రానుందట. ఇక, మూవీ మేకర్స్ సైతం సక్సెస్ టీమ్ నిర్వహించే ఆలోచనను విరమించుకుంటుందట.

ఇక, ఖుషీ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే, మొదటి వారం కలెక్షన్లు బాగానే రాబట్టింది. మొదటి వారాంతంలో రూ.70కోట్లకు పైగా రాబట్టింది. కానీ , ఆ తర్వాత ఫుల్ గా డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ థియేటర్స్ కి కొత్త సినిమాలు వచ్చాయి. దాదాపు చాలా థియేటర్స్ లో ఖుషీని తీసేయడం కూడా అయిపోయింది. ఎక్కడో ఒకటో రెండో, మాత్రమే ఉంచాయి. ఈ లెక్కన ఇప్పటికే ఖుషీ కలెక్షన్లు పూర్తయినట్లే.