Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న.. మ్యాజిక్ షురూ!

తాజాగా, మొదటి సింగిల్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. సమయమా అంటూ సాగే పాట అది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 8:13 AM GMT
హాయ్ నాన్న.. మ్యాజిక్ షురూ!
X

నేచురల్ స్టార్ నాని కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందరిలా కామన్ స్టోరీలు కాకుండా, ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. రీసెంట్ గా దసరా మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీలో చాలా మాస్ గా కనిపించారు. ఇప్పుడు హాయ్ నాన్న అంటూ మరో కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి మ్యాజికల్ ట్రీట్ ఇవ్వనున్నామంటూ ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తాజాగా, మొదటి సింగిల్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. సమయమా అంటూ సాగే పాట అది. జస్ట్ కొన్ని సెకన్ల పాటు ఉన్న ప్రోమోలో నాని, మృణాల్ ని పరిచయం చేశారు. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి కొన్ని వీడియోలు విడుదల చేశారు. అందులో నాని ఫుల్ ఆఫ్ హెయిర్ తో ఉన్నారు. అయితే, ఈ పాట ప్రోమోలో మాత్రం అలా కాకుండా, ఇంకాస్త స్టైలిష్ గా కనపడుతున్నారు.

చేతిలో కెమేరా కూడా ఉంది. ఇక. మృణాల్ సైతం మోడ్రన్ లుక్ లో కనపడుతోంది. ఈ పాటను రేపు అంటే శనివారం ఉదయం 11గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నారు. పాట విడుదల చేస్తే, కానీ , ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుస్తుంది.

ఇక, హాయ్ నాన్న నాని 30వ చిత్రం కావడం విశేషం.వైరా ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్ చెరుకూరి, విజ‌యేంద‌ర్‌రెడ్డి తీగ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ఇది.

ఇక, ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా, హేనాన్న తర్వాత ఆయన మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం రుగుతోంది. . అంటే సుందరానికీ మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయత తో మూవీ చేయనునట్లు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట.