Begin typing your search above and press return to search.

మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న సమంత..!

అందులో ఆమె స్విమ్మింగ్ పూల పక్కన కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత, తాను ఉన్న ప్రాంతంలోని ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోల్లో లొకేషన్లు చాలా అందంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   5 Aug 2023 3:30 PM GMT
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న సమంత..!
X

సమంత పరిచయం అవసరం లేని పేరు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చెన్నై అందం, చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దశాబ్దానికి పైగా ఈ బామ మనల్ని తన నటనతో అలరిస్తూనే ఉంది. ఈమధ్యే తన అనారోగ్య సమస్యల కారణంగా కాస్త బ్రేక్ తీసుకుంది. తన చేతిలో ఉన్న అన్ని సినిమాలను పూర్తి చేసింది. దాదాపు సంవత్సరం పాటు బ్రేక్ తీసుకుంటున్నానని, ఆ తర్వాతే, సినిమాలు చేస్తానంటూ చెప్పింది..





సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. అయితే, ఆలోపు, అక్కడకు వెళ్లేముందు ఆమె దేశంలోని కొన్ని ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మొన్నటి వరకు చెన్నైలోని కొన్ని దేవాలయాలు, ఆ తర్వాత సద్గురు ఆశ్రమంలో సేద తీరిన ఆమె, ఇప్పుడు మరో ప్రదేశంలో ఉన్నారు. అక్కడి ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా షేర్ చేశారు.

అందులో ఆమె స్విమ్మింగ్ పూల పక్కన కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత, తాను ఉన్న ప్రాంతంలోని ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోల్లో లొకేషన్లు చాలా అందంగా ఉన్నాయి. మొత్తం పచ్చని మొక్కలతో అందంగా కనిపిస్తున్నాయి. పండ్లు, పూలతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ ఫోటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా ఆలోచించేలా ఉంది. మంచి రోజులు వస్తాయో, ఎవరికి తెలుసు అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు.

కాగా, ప్రస్తుతం సమంత ఎలాంటి సినిమాలు చేయకపోయినా, ఆమె ఆల్రెడీ చేసిన సినిమాలు మాత్రం విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. విజయ్ దేవర కొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషీ మూవీ మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ, ఇప్పటికే పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

త్వరోలనే ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ రాబోతోంది. ఖుషీ సినిమాలో జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.