Begin typing your search above and press return to search.

మరో మాస్ మూవీ రీ రిలీజ్

ఈ విషయాన్ని అధికారికంగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ రీరిలీజ్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ గా రీరిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:00 AM GMT
మరో మాస్ మూవీ రీ రిలీజ్
X

రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా రెగ్యులర్ గా పాత హిట్ సినిమాలని థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పోకిరి చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికి టాలీవుడ్ లో కొనసాగుతోంది. రీసెంట్ గా రవితేజ సూపర్ హిట్ మూవీ వెంకీ థియేటర్స్ లోకి వచ్చి డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రతి సినిమా రెండు, మూడు రోజుల పాటు థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.

4కె వెర్షన్స్ లో క్వాలిటీ అవుట్ పుట్ తో థియేటర్స్ లో తమ అభిమాన హీరోల సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీని కూడా రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. టాలీవుడ్ కి ఫ్యాక్షన్ ట్రెండ్ ని పరిచయం చేసిన చిత్రం అంటే వెంటనే సమరసింహారెడ్డి మూవీ గురించి అందరూ చెబుతారు.

బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. సమరసింహారెడ్డిని ఫాలో అవుతూ చాలా మంది దర్శకులు ఫ్యాక్షన్ కథలతో సినిమాలు చేశారు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫ్యాక్షన్ టచ్ ఉన్న కథలని చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ క్వాలిటీగా 4కె వెర్షన్ లో రీరిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ రీరిలీజ్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ గా రీరిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. సమరసింహారెడ్డి అంటే ట్రైన్ ఎపిసోడ్ వెంటనే అందరికి గుర్తుకొస్తుంది. గూస్ బాంబ్స్ ఆ ఎలిమెంట్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్, మణిశర్మ సాంగ్స్ థియేటర్స్ లో చూడటానికి నందమూరి అభిమానులు ఇంట్రెస్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

బాలయ్య ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీద ఉండటంతో ఆ బజ్ సమరసింహారెడ్డి రీరిలీజ్ కి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ఎప్పుడు రీరిలీజ్ అవుతుందనేది వేచి చూడాలి.