Begin typing your search above and press return to search.

సమంత నోట... బన్నీకి నిజమైన గౌరవం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది కాలంగా మీడియాకు దూరంగా ఉంటూ, షూటింగ్స్ లేకుండా పూర్తి విశ్రాంతి మూడ్ లో ఉన్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   5 March 2024 9:20 AM GMT
సమంత నోట... బన్నీకి నిజమైన గౌరవం
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది కాలంగా మీడియాకు దూరంగా ఉంటూ, షూటింగ్స్ లేకుండా పూర్తి విశ్రాంతి మూడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు సమంత తిరిగి వచ్చింది. ఆమె సినిమా షూటింగ్స్ తో పాల్గొనడంతో పాటు పబ్లిక్‌ పార్టీలు, ఫంక్షన్స్ కి కూడా హాజరు అవుతూ సందడి చేస్తోంది.

తాజాగా ఒక కాలేజ్‌ ఈవెంట్ లో సమంత పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక ఫ్యాన్స్ సమంతను మీకు యాక్టింగ్‌ లో ఎవరు రోల్‌ మోడల్‌ అంటూ ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో సమంత నవ్వుతూ నాకు యాక్టింగ్‌ లో అల్లు అర్జున్‌ స్ఫూర్తి అన్నట్లుగా సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

గతంలో అల్లు అర్జున్‌ తో కలిసి సన్నాప్‌ సత్యమూర్తి సినిమాలో నటించింది. ఇక బన్నీ పుష్ప లో ఐటం సాంగ్ ను చేసి మొత్తం నేషన్ ని ఊ అంటావా అనిపించింది. ఆకట్టుకునే నటన మరియు డాన్సింగ్‌ స్కిల్స్ తో సమంత ఆకట్టుకుంది. మరోసారి సమంత బన్నీ తో చేయాలనుకుంటుందని ఆమె మాటలతో నిరూపితం అయ్యింది.

సమంత తాజా వ్యాఖ్యలను అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు సందర్భానుసారంగా మాట్లాడే సమంత నోటి నుంచి నటనకు స్ఫూర్తి అంటూ అల్లు అర్జున్‌ పేరు రావడం ఖచ్చితంగా ఆయనకు దక్కిన గౌరవం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమంత పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌. ఆమె నటన లో కచ్చితంగా జాతీయ అవార్డు అందుకునే స్థాయిలో నటిస్తుందని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. అలాంటి జాతీయ అవార్డు స్థాయి నటి నటనలో బన్నీ తనకు స్ఫూర్తి అని చెప్పడం ఖచ్చితంగా గొప్ప గౌరవం అంటూ బన్నీ ఫ్యాన్స్‌ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముందు ముందు వీరి కాంబోలో మరో సినిమా రావాలని అంతా కోరుకుంటున్నారు.