Begin typing your search above and press return to search.

సమంత.. సైలెంట్ గానే బ్లాస్ట్ చేసేలా ఉంది!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

By:  Tupaki Desk   |   11 April 2024 7:03 AM GMT
సమంత.. సైలెంట్ గానే బ్లాస్ట్ చేసేలా ఉంది!
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ మొదట్లో మంచి టాక్ అందుకున్నప్పటికి ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. ఇక సమంత అంతకుముందు యశోదా అనే ఫీమేల్ సెంట్రిక్ కథతో మెప్పించింది. అయితే ఆ సమయానికి ఆమె మాయోసైటిస్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. గత కొంత కాలం నుంచి సమంత మానసిక, శారీరక సమస్యలతో సతమతం అవుతోంది.


దీంతో కొంతకాలం సినిమాలకి విరామం ఇచ్చి శారీరకంగా, మానసిక రికవరీ అయ్యే ప్రయత్నం చేసింది. మరల పూర్తి ఫిట్ నెస్ తో సినిమాలకి రెడీ అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమంత ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ దర్శకులతో చేసిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూర్తిగా యాక్టింగ్ పైనే సమంత కెరియర్ పైన ఫోకస్ చేసిందని తెలుస్తోంది.


అందులో భాగంగా ఆమె చాలా ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతోందంట. అందులో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఉందని సమాచారం. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా మేగ్జిమమ్ కన్ఫర్మ్ అయిపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఇక రాబోయే ప్రాజెక్టుల గురించి పెద్దగా హడావుడి చేయకుండానే అమ్మడు నెక్స్ట్ అప్డేట్స్ తో సోషల్ మీడియాను బ్లాస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.


అలాగే హెచ్ వినోత్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ కెరియర్ లో చేయబోయే ఆఖరి సినిమా కోసం కూడా సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారంట. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాబట్టి సమంతకి కూడా ప్లస్ అవుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. అందుకే వీటిని ఒకే చేసే పనిలో సామ్ ఉందంట.

అలాగే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లతో కూడా వెబ్ సిరీస్ ల కోసం సమంతతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ తరహాలోనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతోనే ఈ వెబ్ సిరీస్ ప్లానింగ్ జరుగుతున్నాయంట. సమంత ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఒక్కొక్కటిగా అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట.

అలాగే బాలీవుడ్ లో కూడా డెబ్యూ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని బిటౌన్ లో వినిపిస్తోంది. ఈ ఏడాదిలో సమంత మరల బ్యాక్ టూ ఫామ్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కమర్షియల్ యాడ్స్, ఫోటో షూట్ లతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలని సామ్ షేర్ చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో సమంత హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.