Begin typing your search above and press return to search.

అలా కనిపించడం నాకు చాలా కష్టం : సమంత

ఈ ఏడాది కాలంలో ఆమె పలు విదేశాల్లో హాలీడేస్ ను ఎంజాయ్ చేసింది.

By:  Tupaki Desk   |   16 March 2024 11:43 AM IST
అలా కనిపించడం నాకు చాలా కష్టం : సమంత
X

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి సినిమా షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతోంది. మయో సైటిస్ తో పాటు విరామం లేని షూటింగ్స్ కారణంగా అలసి పోయిన ముద్దుగుమ్మ సమంత ఏడాది బ్రేక్ తీసుకుంది. ఈ ఏడాది కాలంలో ఆమె పలు విదేశాల్లో హాలీడేస్ ను ఎంజాయ్ చేసింది.

సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె తన అనారోగ్య సమస్యలను చెప్పాలని కోరుకోలేదని, కానీ యశోద సినిమా నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుని ఆ సమయంలో ప్రమోషన్ కి బయటకు వచ్చాను. అప్పుడే తన అనారోగ్య సమస్య బయట పడింది. కానీ కొందరు సింపతీ కోసం అంటూ నన్ను విమర్శించారు అంది.

ఇంకా సమంత మాట్లాడుతూ... అందాల ఆరబోత విషయం తనకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించే విషయమే అన్నట్లుగా ఆమె పేర్కొంది. పుష్ప సినిమాలో ఊ అంటావా పాట కోసం స్కిన్‌ షో చేసిన విషయమై ఆమె స్పందించింది. నాకు అలాంటి ఔట్ ఫిట్స్ తో ఇబ్బందే. అయినా కూడా కొన్ని సార్లు తప్పడం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

అలా కనిపించడం నాకు కెరీర్‌ ఆరంభం నుంచి కూడా కష్టమే. కానీ సినిమా కోసం, ప్రేక్షకుల కోసం అన్నట్లుగా తాను ఔట్ ఫిట్స్ తో కనిపించాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. గత ఏడాది ఖుషి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు త్వరలో సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.