Begin typing your search above and press return to search.

స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం..మ‌ళ్లీ అలా నో!

ఊ అంటావా చేస్తున్నప్పుడు నాకు చాలా అసౌ కర్యంగా అనిపించింది. ఆ పాట చేస్తున్న‌ప్పుడు అందులో నేనే నటిస్తున్నానా? అన్న సందేహం క‌లిగేది.

By:  Tupaki Desk   |   16 March 2024 5:39 PM GMT
స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం..మ‌ళ్లీ అలా నో!
X

'ఊ అంటావా మావ‌..ఊఊ అంటావా మావ' అంటూ స‌మంత ఇండియాని ఎలా షేక్ చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క హాట్ ఐటం నెంబ‌ర్ తో అమ్మ‌డు ఏకంగా ఖండాలే దాటిపోయింది. స‌మంత హాట్ పెర్పా ర్మెన్స్ కి ప్ర‌పంచ‌మే ఫిదా అయింది. ఆ పెర్మార్మెన్స్ చూస్తున్నంత సేపు అందులో క‌నిపించేది స‌మంత నేనా? అన్న సందేహం త‌లెత్తింది. అంత‌వ‌ర‌కూ డీసెంట్ రోల్స్ తో మెప్పించిన సామ్ అలాంటి హాట్ నెంబ‌ర్ లో క‌నిపించేస‌రికి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన అభిమానులు ఎంతో మంది.

మ‌రి ఇలాంటి నెంబ‌ర్ లో స‌మంత అంత ఈజీగా ఎలా చేయ‌గ‌లిగింది? అందుకోసం తానెంత అసౌక‌ర్యానికి గురైందో తెలుసా? తాజాగా ఈ అంశంపై స‌మంత‌ తొలిసారి స్పందించింది. 'నేను ఎల్లప్పుడూ ఒక జోన్‌లో పనిచేస్తాను. ఆజోన్ దాటి తొంద‌ర‌గా బ‌య‌ట‌కు రాలేను. ఊ అంటావా చేస్తున్నప్పుడు నాకు చాలా అసౌ కర్యంగా అనిపించింది. ఆ పాట చేస్తున్న‌ప్పుడు అందులో నేనే నటిస్తున్నానా? అన్న సందేహం క‌లిగేది.

నేను నా కెరీర్‌లో మళ్లీ ఇలాంటివి చేయను. నటిగా నాలో మరో కోణాన్ని చూపించే ప్ర‌య‌త్నం మాత్ర‌మే అది. అదే త‌ర‌హా లో ఇక‌పై కొన‌సాగుతాన‌ని మాత్రం కాదు. కొన్ని ప‌రిమితులు విధించుకునే ఆ పాట‌లో న‌టించాను' అని తెలిపింది. దీంతో స‌మంత కొన్ని ర‌కాల ప్ర‌చార‌ల‌కు పుల్ స్టాప్ పెట్టిన‌ట్లు అయింది. ఊ అంటావా? లాంటి ప్ర‌య‌త్నాలు స‌మంత మ‌ళ్లీ చేస్తుందా? అన్న సందేహాలున్నాయి.

మిగ‌తా స్టార్ హీరోల చిత్రాల్లో అలాంటి ఆఫ‌ర్లు వ‌స్తే న‌టిస్తుందా? లేదా? అని కొన్ని విశ్లేష‌ణ‌లు ఇప్ప‌టికే తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా స‌మంత స‌మాధానంతో అందుకు ఛాన్సే లేద‌ని తెలుస్తోంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో స‌మంత హాట్ పెర్పార్మెన్స్ తెలిసిందే. మ‌రి ఆ త‌ర‌హా పాత్ర‌లు కొన‌సాగిస్తుందా? వాటికి పుల్ స్టాప్ పెట్టేస్తుందా? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం స‌మంత బాలీవుడ్ కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే.