Begin typing your search above and press return to search.

ఆ రెండు పడితే సమంతకు ఇక తిరుగులేదంతే..!

కాకపోతే రెండు భారీ సినిమాల్లో సమంత నటించే ఛాన్స్ ఉందని టాక్. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా మరొకటి తమిళ సినిమా అని టాక్.

By:  Tupaki Desk   |   10 April 2024 5:23 AM GMT
ఆ రెండు పడితే సమంతకు ఇక తిరుగులేదంతే..!
X

రోజుకొక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి అడుగుపెడుతున్న ఈ టైం లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు కూడా డిమాండ్ బాగానే ఉంది. కోలీవుడ్ లో ఇప్పటికీ త్రిష, నయనతార తమ ఫాం కొనసాగిస్తుండగా తెలుగులో మాత్రం ఆ జోరు కాస్త తగ్గింది. అయితే అనుష్క, సమంత లాంటి హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తే పరిస్థితి మరోలా ఉండేది కానీ వారి పర్సనల్ రీజన్స్ వల్ల సినిమాలకు టైం తీసుకుంటున్నారు.

ముఖ్యంగా సమంత యశోద, శాకుంతలం తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి కోసం చాలా టైం తీసుకుంది. మయోసైటిస్ వల్ల కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న సమంత రెండేళ్లు దాని వల్ల బాధపడి ఇప్పుడు మళ్లీ సెట్ రైట్ అయ్యింది. తను తిరిగి ఫాంలోకి వచ్చానని చెప్పేలా అమ్మడు వరుస ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో స్పెషల్ డిస్కషన్స్ గా మారాయి.

సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటించింది. ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. కాకపోతే రెండు భారీ సినిమాల్లో సమంత నటించే ఛాన్స్ ఉందని టాక్. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా మరొకటి తమిళ సినిమా అని టాక్. తెలుగులో అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో సమంత హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ ఉందట. అల్లు అర్జున్ సమంత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పుష్ప 1 లో కూడా సమంత ఉ అంటావా సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది.

సమంత తనకు లక్కీనే కాబట్టి అల్లు అర్జున్ నో చెప్పే ఛాన్స్ లేదు. అట్లీ డైరెక్షన్ లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా లో నటించే హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ కావాల్సి ఉంది. మరోపక్క సమంత దళపతి విజయ్ నెక్స్ట్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో జి.ఓ.ఏ.టి సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత హెచ్.వినోద్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా ఎంపిక చేశారని కోలీవుడ్ మీడియా టాక్. ఆల్రెడీ సమంత విజయ్ తో కూడా అంతకుముందు నటించి మెప్పించింది. రెండేళ్ల గ్యాప్ తో రీ ఎంట్రీ ఇస్తున్న సమంత తెలుగులో అల్లు అర్జున్, తమిళంలో విజయ్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు పడితే సమంత మళ్లీ తిరిగి కెరీర్ స్ట్రాంగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు సినిమాలు పడితే మాత్రం సమంతకు తిరుగు ఉండదని చెప్పొచ్చు.