Begin typing your search above and press return to search.

సమంతకు ఆ డైరెక్టర్ అంటే అంత గౌరవమా?

సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియాలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

By:  Tupaki Desk   |   22 March 2024 7:41 AM GMT
సమంతకు ఆ డైరెక్టర్ అంటే అంత గౌరవమా?
X

సమంత.. ఈ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. వరుస ఫొటో షూట్స్ లేక రూమర్స్ లేక మూవీ అప్డేట్.. ఇలా ఏదో ఒక విషయంపై సామ్ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన సమంత.. మళ్లీ అలరించేందుకు రెడీ అయింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ సామ్.. విదేశాల్లో ఫుల్ రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇండియాకు తిరిగొచ్చేసింది.

సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియాలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల మేకర్స్.. ప్రమోషన్లను స్టార్ చేశారు. స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో వరుణ్ ధావన్, సమంత సీరియస్ లుక్స్ లో గన్స్ పట్టుకుని కనిపిస్తున్నారు. సిరీస్ పై మరింత హైప్ క్రియేట్ చేశారు.

ఇక ఈ ఈవెంట్ లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహార్ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేసింది సామ్. దీంతో కరణ్ జోహార్ నో నో అంటూ వారిస్తూ వెనక్కి వెళ్లిపోయారు. దీంతో సమంత కూడా నవ్వుకుంటూ వెనక్కి వచ్చేసింది. అంతకుముందు వరుణ్ ధావన్.. కరణ్ పాదాలకు నమస్కరించారు. ఆ తర్వాత సమంత కూడా నేనూ చేస్తానంటూ ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ సమయంలో కరణ్ జోహార్ తన వ్యాఖ్యలతో అందరినీ నవ్వులు పూయించారు. తనను అప్పుడే అంత పెద్దవాడిని చేసేయకండని కరణ్ అన్నారు. రీసెంట్ గానే ఒక ఏజ్ దాటిందని, దానిని మళ్లీ గుర్తుచేయొద్దని నవ్వుతూ అన్నారు. అప్పుడు వరుణ్.. మీ ముఖంలో ఏజ్ కనపడకుండా, మీ స్కిన్ డాక్టర్ బాగా కష్టపడుతున్నారని సైటెర్స్ వేశారు. తాను చాలా మందిలా ముఖానికి సర్జరీలు చేయించుకోలేదని కౌంటర్ ఇచ్చారు కరణ్.

ఇక సామ్.. కొన్నిరోజుల క్రితం కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లింది. అప్పుడు నుంచి కరణ్ జోహర్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ షోలో తన కెరీర్ అండ్ లైఫ్ కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సిటాడెల్ వెబ్ సిరీస్ లో వరుణ్, సమంతతోపాటు సిమ్రాన్, కేకే మీనన్, శివశక్తి సింగ్ తదితరులు నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.