Begin typing your search above and press return to search.

నెంబర్ వన్ స్థానంలో సమంత.. అదిరిపోయే రికార్డ్

సోషల్ మీడియా లో మోస్ట్ పాపులర్ యాక్టర్ గా సమంత నిలవడం విశేషం. టాప్ టెన్ హీరోయిన్స్ మొదటి స్థానం లో ఆమె ఉంది.

By:  Tupaki Desk   |   22 July 2023 4:24 AM GMT
నెంబర్ వన్ స్థానంలో సమంత.. అదిరిపోయే రికార్డ్
X

సెలబ్రెటీ సెలబ్రిటీల కు సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఫాలో అవుతూ వారికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ కి సోషల్ మీడియా లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు అనే సంగతి అందరికీ తెలిసిందే.

అయితే సౌత్ ఇండియా లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ జాబితా లో స్టార్ యాక్టర్ సమంత నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పాలి. సమంతకి ఇన్స్టాగ్రామ్ లో 28 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కారణంగానే ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టిన లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయ ఓరామ్యాక్స్ ఇండియా ప్రతినెల మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తూ ఉంటుంది.

అలా జూన్ నెలలో సోషల్ మీడియా లో మోస్ట్ పాపులర్ యాక్టర్ గా సమంత నిలవడం విశేషం. టాప్ టెన్ హీరోయిన్స్ మొదటి స్థానం లో ఆమె ఉంది. ఈ జాబితా లో రెండో స్థానం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్, మూడవ స్థానం లో దీపికా పదుకొనే, ఫోర్త్ ప్లేస్ లో సౌత్ ఇండియన్ ఉమెన్ సూపర్ స్టార్ నయనతార నిలవడం విశేషం. ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉంది.

ఈ జాబితా లో సోషల్ మీడియా క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన 10వ స్థానంలో ఉండడం విశేషం. ఆమె కంటే ముందు తొమ్మిదవ స్థానం లో కీర్తి సురేష్ నిలిచింది. ఇక ఈ జాబితా లో ఐదు మంది సౌత్ ఇండియన్ హీరోయిన్స్ స్థానం దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడి గా ఖుషి సినిమా కంప్లీట్ చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు గా హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత మెయిన్ లీడ్ చేస్తోంది. వరుణ్ ధావన్ సమంతకి ఈ వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ లో రాజ్ అండ్ డీకే నిడిమోరు ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.